శ్రీవేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాలలో ప్ర‌వేశాలు

శ్రీవేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాలలో ప్ర‌వేశాలు

తిరుపతి, మే-19, 2009: తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి శ్రీవేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాల,తిరుపతి నందు 2009-2010 విధ్యాసంవత్సరమునకుగాను ప్రిపరేటరికోర్సునందు విద్యార్థులను చేర్చుకొనుటకుగాను అర్హులైన రాయలసీమ జిల్లా మరియు నెల్లూరు జిల్లా వాసుల విద్యార్థుల నుండి దరఖాస్థులు కోరడమైనది.

తిరుమల తిరుపతి దేవస్థానములు యాజమాన్యములోని బధిర ఉన్నత పాఠశాల, తిరుపతి నందు 2009-2010 విద్యాసంవత్సరమునకు గాను అర్హత కలిగిన విద్యార్థులనుండి ప్రిపరేటరి కోర్సునందు చేర్చుకొనుటకు మే నెల 5వ తారీఖునుండి 31వ తారీఖువరకు దరఖాస్తులు ఇవ్వనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. మరియు పూర్తి చేసిన దరఖాస్తు ఫారములను జూన్‌ నెల 6వ తారీఖు వరకు స్వీకరింపబడును.

ఇతర వివరములకు బధిర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.