MORE DELICIOUS AND CLEAN ANNA PRASADAM TO DEVOTEES_ శ్రీవారి భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు
TTD ANNA PRASADAM IN PUSHKARAMS AND FESTIVAL GATHERINGS TOO- TTD EO
Tirumala, 03 September 2021: TTD EO Dr KS Jawahar Reddy has directed officials to provide delicious, tasty and clean Anna Prasadam to all devotees coming to Tirumala for Srivari darshan.
Addressing a review meeting with officials of Anna Prasadam Trust at the TTD administrative building on Friday evening the TTD EO asked officials to increase the quantity of vegetables in the Anna Prasadam provided to devotees at the Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Bhavan with different menus for the afternoon and night meals.
He also instructed officials to enforce a dress code for Anna Prasadam Complex staff like aprons, caps and gloves. He said that both cooks and serving staff should be provided training in standard hospitality institutions on the art of how to address devotees and serve food to them.
He directed officials to buy modern equipment for the kitchen and serving at the dining halls. He also asked them to cross-check the quality of cooking material like rice, pulses, edible oils, ghee and vegetables to ensure the provision of quality Prasadam to devotees.
He also directed officials to prepare plans to provide TTD Anna Prasadam at mega religious events like Pushkarams and festivals in the entire South Indian states.
Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, FA& CAO Sri O Balaji, Additional CVSO Sri Ravi Prasadudu, Anna Prasadam Dyeo Sri Harindranath, Catering Officer Sri GLN Shastri and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు
– పుష్కరాల్లోనూ, ఉత్సవాల్లో భక్తులకు అన్నప్రసాదాలు అందించే ఏర్పాట్లు చేయాలి – టిటిడి ఈవో
తిరుమల, 2021 సెప్టెంబరు 03: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందించాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో అన్నప్రసాదం ట్రస్టుపై అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అందించే అన్నప్రసాదాల్లో కూరగాయల సంఖ్య పెంచాలన్నారు. మధ్యాహ్నం ఒక రకమైన మెనూ, రాత్రి ఒక రకమైన మెనూ అందించేందుకు రకరకాలైన కూరగాయలను వాడాలన్నారు. అన్నప్రసాదం ట్రస్టు కింద పనిచేసే సిబ్బందికి డ్రస్‌కోడ్, క్యాప్స్, గ్లౌజ్ అందివ్వాలన్నారు. ముఖ్యంగా వంట మాస్టార్లకు, సర్వింగ్ చేసే సిబ్బందికి అవసరమైన మెలకువలు నేర్చుకోవడానికి ప్రముఖ సంస్థలతో శిక్షణ అందివ్వాలని సూచించారు. సర్వింగ్ సిబ్బంది వడ్డించేటప్పుడు భక్తులను ఎలా సంభోదించాలి, సర్వింగ్ ఎలా చేయ్యాలి, ఏవిధంగా మెలగాలి అనేది ఈ శిక్షణలో భాగంగా ఉండాలన్నారు.
అన్నప్రసాదాల తయారు చేసే కిచన్, డైనింగ్ హాల్‌లో అవసరమైన ఆధునిక యంత్రాలు, పరికరాలను అన్నప్రసాదం ట్రస్టు ద్వారా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అన్నప్రసాదాల తయారీలో వినియోగించే బియ్యం, పప్పు ధాన్యాలు, నూనె, నెయ్యి తదితర ముడిసరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు. తద్వార భక్తులకు అందించే భోజనంలో నాణ్యత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మన రాష్ట్రంలోనే గాక దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే పుష్కరాలు, ప్రత్యేక ఉత్సావాలు వంటి పెద్ద జన సమూహం ఉండే వేడుకలలో కూడా, భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, అదనపు ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ రవిప్రసాదు, అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రీ ఈ సమీక్షలో పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.