HOMA MAHOTSAVAM BEGINS AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలు ప్రారంభం
Tirupati,16 January 2023: The Six-day Homa Mahotsavams organised by TTD from January 16-21 for global harmony commenced at Sri Kapileswara temple on Monday.
The Homa Mahotsavam sponsored by the TTD Chairman Sri YV Subba Reddy comprised of Sri Subramaniam Swami Homam on Jan.17, Sri Durga, Saraswati and Lakshmi Homa on Jan.18, Sri Navagraha Homa on Jan. 19, Sri Dakshinamurthy Homam on Jan. 20, and Sri Rudra and Sri Mrutyunjaya Swami Homa on Jan.21.
Besides TTD Chairman couple, CVSO Sri Narasimha Kishore, DyEO Sri Devendra Babu, AEO Sri Parthasarathy and others were present.
శ్రీ కపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2023, జనవరి 16: లోక కళ్యాణార్థం తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం హోమ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. జనవరి 16 నుంచి 21వ తేదీ వరకు ఆరు రోజులపాటు ప్రత్యేక హోమ మహోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే.
గణపతి పూజతో హోమ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. పుణ్యాహవాచనం, దేవతా అనుజ్ఞ, మహాగణపతి కలశ స్థాపన, మహాగణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
జనవరి 17వ తేదీ శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం, జనవరి 18న శ్రీ దుర్గ, శ్రీ లక్ష్మీ,
శ్రీ సరస్వతి అమ్మవార్ల హోమం, జనవరి 19న శ్రీ నవగ్రహ హోమం నిర్వహిస్తారు.
జనవరి 20న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, జనవరి 21న శ్రీ రుద్ర , శ్రీ మృత్యుంజయ స్వామి వారి హోమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు నిర్వహిస్తున్న హోమ మహోత్సవాల్లో చైర్మన్ దంపతులతో పాటు, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, డిప్యూటి ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఎఈవో శ్రీ పార్థ సారధి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.