శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

తిరుపతి, ఏప్రిల్‌  21, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 7.30 గంటల నుండి 8.30 గంటల వరకు ఉత్సవమూర్తులను కళ్యాణమండపానికి వేంచేపు చేశారు.అనంతరం ఉదయం నరసింహతీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీ కోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు యాగశాల కార్యక్రమం, అగ్నిప్రతిష్ట,చతుర్దశ కలశస్నపనం నిర్వహించారు.

రాత్రి 7.00 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరుగనుంది. రాత్రి 9.00 గంటల నుండి 10.00 గంటల వరకు శ్రీరాములవారు, ఆంజనేయస్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.