GADICHARLA HARI SARVOTTAMA RAO’S LIFE IS AN EXAMPLE FOR TODAY’S GENERATION –  PROF. KUSUMA KUMARI _ శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు జీవితం నేటి తరానికి ఆదర్శం : ప్రొ. కుసుమ కుమారి

Tirupati, 29 February 2024: Sri Gadicharla Hari Sarvothamma Rao’s life is an example for today’s generation, said Sri Krishnadevaraya University retired VC Prof.  Kusuma Kumari. 

The 64th birth anniversary of Sri Gadicharla Hari Sarvottam Rao was held under the auspices of Sri Venkateswara Central Library and Research Centre, Tirupati.

Speaking on the occasion Prof.  Kusuma Kumari said Sri Hari Sarvottama Rao was a great person who introduced the library movement and the importance of adult education.

Sri Bhuman Subramanyam Reddy, Director of SVETA, who presided over the program, explained to the students about the uniqueness of the library with the inspiration of Sri Gadicharla how the  Library has taken up digitization and collection of books.

Later, Sri Sannidhanam Narasimha Sharma, Curator of Gautami Library from Rajahmundry, said that Sri Hari Sarvottama Rao was a great freedom fighter, we should respect our land that gained independence through hard work and we should not forget the spirit of freedom fighters.

Sri Ramachandra Reddy, Retired Professor of History Department of SV University, Dr. Pullareddy, Officer of SV Central Library and Research Center, students of SV Arts College, SPW Mahila College participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు జీవితం నేటి తరానికి ఆదర్శం : ప్రొ. కుసుమ కుమారి

తిరుపతి, 29 ఫిబ్రవరి 2024: శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు జీవితం నేటి తరానికి ఆదర్శమని అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత విసి ప్రొ. కుసుమ కుమారి చెప్పారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం మరియు పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో గాడిచర్ల శ్రీ సర్వోత్తమరావు 64వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొ. కుసుమ కుమారి మాట్లాడుతూ, గ్రంథాలయ ఉద్యమాన్ని, వయోజన విద్య గొప్పతనాన్ని గురించి తెలియజేసిన గొప్ప వ్యక్తి హరి సర్వోత్తమరావు అని తెలిపారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్వేత సంచాలకులు శ్రీ భూమన్ మాట్లాడుతూ, గ్రంథాలయ విశిష్టత గురించి గాడిచర్ల వారి ఔన్నత్యాన్ని గురించి విద్యార్థులకు వివరించారు. వారి స్ఫూర్తితో శ్వేత గ్రంథాలయం డిజిటలైజేషన్ మరియు గ్రంథాల సేకరణ చేస్తోందన్నారు.

అనంతరం రాజమండ్రికి చెందిన‌ గౌతమీ గ్రంథాలయంకర్త శ్రీ సన్నిధానం నరసింహ శర్మ మాట్లాడుతూ, హరి సర్వోత్తమరావు గొప్ప స్వతంత్య్ర‌ సమరయోధుడని, కష్టపడి స్వాతంత్య్రం సాధించుకున్న మన భూమిని మనం గౌరవించాలని, స్వతంత్య్ర‌ యోధుల స్ఫూర్తిని మర్చిపోకూడదని వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర విభాగం విశ్రాంత ఆచార్యులు శ్రీ రామచంద్రా రెడ్డి, ఎస్వీ కేంద్ర గ్రంథాలయం మరియు పరిశోధనా కేంద్రం అధికారి డా.పుల్లారెడ్డి, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌పిడ‌బ్ల్యు మహిళా కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.