LOK SABHA SPEAKER OM BIRLA PRAYS TO GODDESS PADMAVATHI _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా
Tirupati, 16 Aug. 21: Lok Sabha Speaker Sri Om Birla along with family members offered prayers at Sri Padmavati Ammavari Temple, Tiruchanoor on Monday afternoon.
He was received by the TTD Chairman Sri YV Subba Reddy and TTD JEO Smt Sada Bhargavi at the temple entrance.
Sri Birla prayed at the Dwajasthambham and later at the Sri Padmavati Ammavari sanctum.
Thereafter at the Ashirvada Mandapam, the TTD Chairman presented Ammavari Thirtha Prasadam to the Honourable Speaker.
MPs Sri Vijayasai Reddy Sri Mitchun Reddy, Sri M Gurumurthy, Deputy EO Smt Kasturi Bai were present.
PRAYED FOR PROSPERITY AND HEALTH OF NATION:
Speaking to media persons outside the temple later Sri Birla said he prayed for welfare, prosperity and health safeguard of people.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా
తిరుపతి 16 ఆగస్టు 2021: లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సోమవారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద స్పీకర్ కు టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
ఆలయంలో ధ్వజస్తంబానికి మొక్కు కున్న అనంతరం శ్రీ ఓంబిర్లా అమ్మవారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి స్పీకర్ కు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అందించారు. ఎంపి లు శ్రీ వి.విజయసాయిరెడ్డి, శ్రీ పివి మిథున్ రెడ్డి, శ్రీ ఎం. గురుమూర్తి , డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి
పాల్గొన్నారు.
దేశం క్షేమంగా ఉండాలని కోరుకున్నా దేశం క్షేమంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయారారోగ్యాలతో ఉండాలని శ్రీ పద్మావతి అమ్మవారిని కోరుకున్నానని స్పీకర్ శ్రీ ఓం బిర్లా చెప్పారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది