ANKURARPANAM FOR PAVITROTSAVAMS _ శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు సెప్టెంబరు 17న అంకురార్పణ
Tirupati, 16 Sep. 21: The Ankurarpanam fete will be held in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor and in Sri Parasareswara Swamy temple at Narayanavanam on Friday evening in connection with annual Pavitrotsavams which are commencing from Saturday September 18 onwards.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు సెప్టెంబరు 17న అంకురార్పణ
తిరుపతి, 2021 సెప్టెంబరు 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 17న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబరు 18 నుండి 20వ తేదీ వరకు అమ్మవారి పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
సెప్టెంబరు 18న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 19న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 20న మహాపూర్ణాహుతి చేపడతారు. చివరిరోజు మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు స్నపనతిరుమంజనం, ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.