సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకై దేహదారుడ్య, పరుగుపోటీల పరీక్షలు

సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకై దేహదారుడ్య, పరుగుపోటీల పరీక్షలు

తిరుపతి, ఫిబ్రవరి – 03, 2011: తిరుమల తిరుపతి దేవస్థానములో సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకై దేహదారుడ్య, పరుగుపోటీల పరీక్షలు ఫిబ్రవరి 5వ తేది ఉదయం 8 గంటలకు కల్యాణిడ్యాం వద్ద గల పోలీస్‌ ట్రైనింగ్‌ గ్రౌండునందు నిర్వహిస్తారు.

ఇదివరకే సెక్యూరిటీగార్డుల ఉద్యోగాలకై దరఖాస్తు చేసి, కాల్‌లెటర్లు అందుకున్న అభ్యర్థులకు 5వ తేది ఉదయం 8 గంటలకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. అనంతరం దేహదారుడ్య, పరుగుపోటీ పరీక్షలు నిర్వహిస్తారు. కనుక అభ్యర్థులు ఈ విషయాలను గమనించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.