సెప్టెంబరు 12న శ్రీవారి కల్యాణకట్ట సేవకుల జాబితా విడుదల

సెప్టెంబరు 12న శ్రీవారి కల్యాణకట్ట సేవకుల జాబితా విడుదల

తిరుమల, సెప్టెంబరు 11, 2013: శ్రీవారి కల్యాణకట్ట సేవకులుగా ఈ నెల 15 నుండి 2014, జనవరి 20వ తేదీ వరకు తిరుమలకు వచ్చే భక్తులకు ఉచితంగా తలనీలాలు తీసేందుకు అర్హులైన వారి జాబితాను రూపొందించడమైనది. ఈ మేరకు కల్యాణకట్ట సేవకులు తితిదే కల్యాణకట్ట ఉప కార్యనిర్వహణాధికారి నిర్దేశించిన టైమ్‌ షెడ్యూల్‌ ప్రకారం వారికి కేటాయించిన ప్రదేశంలో మాత్రమే తితిదే నియమ నిబంధనల మేరకు సేవలందించాలని కోరడమైనది. సెప్టెంబరు 12వ తేదీన తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయాలు, తిరుమలలోని ఆర్‌టిసి బస్టాండు లోపల గల శ్రీవారి సేవాసదన్‌, తితిదే వెబ్‌సైట్‌ గీగీగీ.శిరిజీతిళీబిజిబి.ళిజీవీలో  కల్యాణకట్ట సేవకుల జాబితాను అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది