TTD CLARIFIES _ సొంత ఛాన‌ల్‌, రేడియో ఉన్నందువ‌ల్లే ఆకాశ‌వాణిలో ప్ర‌సారాలు ఆపివేశాం : టిటిడి

Tirupati 25 Nov. 21: With an aim to telecast the rituals, religious events, festivals that are performed in the Srivari temple at Tirumala every day on SVBC and SVBC Radio,  TTD has stopped the services of Akasavani-All India Radio Tirupati FM.

In a statement released on Thursday evening, TTD said it has entered MoU with Akasavani for an everyday three hour slot from 3am to 6am to live relay the programmes in Tirumala temple during that time on payment of Rs. 35akhs per annum.

When TTD is having its own Channel and Radio to live telecast and relay all the rituals in the temple, it has decided to stop the services of Akashvani.

Devotees are requested to make note of this and watch and listen to the live programmes on SVBC and SV FM.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సొంత ఛాన‌ల్‌, రేడియో ఉన్నందువ‌ల్లే ఆకాశ‌వాణిలో ప్ర‌సారాలు ఆపివేశాం : టిటిడి

తిరుమల, 2021 న‌వంబరు 25: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగే సుప్ర‌భాతం, ఇత‌ర సేవ‌ల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌, ఎస్వీబీసీ రేడియో, ఎస్వీ ఎఫ్ఎం రేడియో ద్వారా ప్ర‌సారం చేసుకోవాల‌నే ఉద్దేశంతోనే ఆకాశ‌వాణి ద్వారా ఈ ప్ర‌సారాల‌ను నిలుపుద‌ల చేయించిన‌ట్టు టిటిడి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 2018లో టిటిడి ఆకాశ‌వాణితో చేసుకున్న ఒప్పందం మేర‌కు ప్ర‌తిరోజూ ఉద‌యం 3 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగే సేవ‌ల‌ను ప్ర‌సారం చేసేందుకు గాను ఆకాశ‌వాణికి ఏడాదికి రూ.35 ల‌క్ష‌ల చొప్పున చెల్లించాల్సి ఉంది. టిటిడికి సొంత ఛాన‌ల్‌, ఎఫ్ఎం రేడియో ఉన్నందువ‌ల్ల ఆకాశ‌వాణిలో ఈ ప్ర‌సారాల‌ను నిలిపివేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. టిటిడి ఎఫ్ఎం రేడియో, ఎస్వీబీసీ రేడియోలో శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగే సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న ఇతర సేవ‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం జ‌రుగుతోంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గుర్తించి స్వామివారి సేవ‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వినాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.