TTD EO REVIEWS SVIMS DEVELOPMENT WORKS _ స్విమ్స్ ను దేశంలో అత్యుత్తమ ఆసుపత్రుల స్థాయికి తీసుకురావాలి

Tirupati, 03 February 2022: TTD EO Dr KS Jawahar Reddy has urged TTD officials to strive to make SVIMS (Sri Venkateswara Institute of Medical Sciences) hospital at Tirupati as one of the top hospitals in the country with all necessary infrastructure made available.

He reviewed the functioning of SVIMS hospital and Sri Padmavati medical College on Thursday evening at the Sri Padmavati Rest House in Tirupati.

He said all arrangements be made to disburse medical bills of cashless treatment as per MoU with health insurance companies within 3 months and in case of delays agreed percentage of interest also be slapped with advance notice to those institutions in the recovery of arrears.

He directed officials to set up a committee of seniors to decide on the tariff of surgeries at SVIMS, which should study the tariffs in other hospitals and thereafter modify the rates.

Among others, he asked officials to focus on newly launched 35 paying rooms and also bring to use the remaining 65 rooms also by February 15. He directed concerned to prepare a new software for regulation of billing and treatment and also train hospital staff in the operation of the software.

He also directed officials to strengthen the Cardiology, Neurosurgery, Oncology wings and make SVIMS as top speciality hospital in the South.

He asked officials to undertake an opinion poll among patients etc. by a third party agency to assess the quality of service in SVIMS.

The TTD EO asked engineering officials to build a waiting hall for patients in OP and also their attendants and prepare an action plan to elevate the Sri Padmavati medical college to top 10 position from the present 28th rank.

He also suggested organising digital classes to facilitate the students to access technology to interact with specialist teachers in other top medical colleges.

Among others, he wanted promotion of research works, publication of articles in international magazines etc.

Thereafter he also reviewed the works of Sri Padmavati Children’s Cardiac hospital, it’s buildings and medical equipment etc.

JEO Sri Veerabrahmam, FA & CAO Sri Balaji, SVIMS Director Dr Vengamma, Sri Padmavati Hridayalaya Director Dr Srinath Reddy, SVIMS MS Dr Ram, TTD SE Sri Venkateswarlu, EE Sri Krishna Reddy were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

స్విమ్స్ ను దేశంలో అత్యుత్తమ ఆసుపత్రుల స్థాయికి తీసుకురావాలి

– సేవలపై రోగుల నుంచి ఖచ్చితమైన అభిప్రాయాలు సేకరించాలి
– పరిశోధన, ఉత్తమ బోధన కు అన్ని వసతులు కల్పిస్తాం

స్విమ్స్ సమీక్షలో టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

తిరుపతి 3 జనవరి 2022: దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రుల జాబితాలోకి స్విమ్స్ తీసుకురావడానికి కృషి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన వసతులన్నీ సమకూరుస్తామని చెప్పారు.

స్విమ్స్ ఆసుపత్రి, శ్రీ పద్మావతి వైద్య కళాశాల పై గురువారం సాయంత్రం శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇన్స్యూరెన్స్ సంస్థలతో కుదుర్చుకున్న నగదురహిత వైద్యం కు సంబంధించిన బిల్లులు సంబంధిత సంస్థలు మూడు నెలల్లోగా చెల్లించే ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఆలస్యం చేస్తే నిర్ణీత శాతం మేరకు వడ్డీ వసూలు చేసే పద్ధతి అమలు చేయాలని చెప్పారు. ఈ విషయం ఆయా సంస్థలకు తెలియజేసి బకాయిల వసూలు పై శ్రద్ధ చూపాలని ఆదేశించారు. స్విమ్స్ లో సర్జరీల ధరల నిర్ణయానికి సీనియర్లతో కమిటీ వేయాలని చెప్పారు. ఈ కమిటీ ఇతర ఆసుపత్రుల్లో అధ్యయనం చేసి పెంచాల్సిన చోట పెంచడం, తగ్గించాల్సిన చోట తగ్గించడం చేయాలన్నారు. స్విమ్స్ల్ లో ఇటీవల ప్రారంభించిన 35 పేయింగ్ గదుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మిగిలిన 65 గదులను ఈ నెల 15 వతేదీకి అందుబాటులోకి తేవాలని సూచించారు. బిల్లింగ్, చికిత్సలకు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలన్నారు. దీని నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఈవో చెప్పారు. కార్డియాలజి, న్యూరో సర్జరి, ఆంకాలజి విభాగాలను మరింత పటిష్టం చేసి దక్షిణాది లో అత్యుత్తమ సేవలు అందించే స్థాయికి తేవాలన్నారు. వైద్య సేవలపై రోగుల అభిప్రాయాలు సేకరించాలని, ఇది స్విమ్స్ సిబ్బంది కాకుండా ఇతరులతో జరిపించాలని సూచించారు. ఆసుపత్రి ఓపి కోసం వచ్చే రోగులు, సహాయకుల వసతి కోసం హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

శ్రీపద్మావతి వైద్య కళాశాల దేశంలో 28వ ర్యాంక్ లో ఉందని, దీన్ని టాప్ 10 లోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కళాశాలలో డిజిటల్ తరగతులు జరిగేలా, విద్యార్థులు ఇతర ప్రముఖ వైద్య కళాశాల ల అధ్యాపకుల తరగతులు వినేలా సాంకేతిక ఏర్పాట్లు చేయాలన్నారు. పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలని, అంతర్జాతీయ జర్నల్స్ లో వ్యాసాలు ప్రచురితమయ్యేలా కృషి జరగాలని ఈవో సూచించారు. వైద్య కళాశాల బోధన తీరుపై విద్యార్థుల అభిప్రాయాలు సేకరించాలన్నారు. విద్యార్థులకు ఉత్తమ బోధన, శిక్షణ కు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని డాక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న శ్రీపద్మావతి వైద్య కళాశాల హాస్టల్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అనంతరం శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై ఈవో సమీక్ష నిర్వహించారు. భవనాలు, వైద్య పరికరాల ఏర్పాటు అంశాలపై అధికారులతో చర్చించారు.

ఈ సమీక్షలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ ఏ సి ఏవో శ్రీ బాలాజి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, శ్రీ పద్మావతి హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి, స్విమ్స్ ఎం ఎస్ డాక్టర్ రామ్, టీటీడీ ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, ఈ ఈ శ్రీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది