PM LAUDS TTD PROMOTION OF GENERIC MEDICINES _ స్విమ్స్ లో జనరిక్ మందుల వాడకం పట్ల ప్రధాని అభినందన
Tirupati, 28 January 2021: In a shot in the arm of TTD’s welfare activities the Honourable Prime Minister Sri Narendra Modi has lauded the utility of generic medicine at the premiere Medicare Center of Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) at Tirupati.
Following directions of TTD Trust Board Chairman Sri YV Subba Reddy, the TTD has been promoting generic medicines in Medicare services of all its hospitals particularly at SVIMS.
The PM was informed recently during a video conferencing by the AP Chief Secretary Sri Adityanath Das about SVIMS adoption of generic medicine in its vast range of services.
The PM expressed his pleasure when informed that on the initiative of TTD Chairman all TTD run hospitals have been utilising Generic medicines popularised under PM program to bring down medicine cost within the reach of the common man.
The PM Modi had also urged the PHCs and CHCs in all states to provide rent-free shop space for sale and distribution of generic medicine to poor.
He also urged for wide range publicity in social media to empower people about the benefits of generic medicine to lead a healthy life.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్విమ్స్ లో జనరిక్ మందుల వాడకం పట్ల ప్రధాని అభినందన
– చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి నిర్ణయంతో టీటీడీ ఆసుపత్రుల్లో పెరిగిన జనరిక్ మందుల వాడకం
తిరుపతి 28 జనవరి 2021 : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( స్విమ్స్) జనరిక్ మందుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్న తీరును ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అభినందించారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో టీటీడీ వైద్య శాలల్లో జనరిక్ మందుల వాడకాన్ని ప్రోత్సహిస్తుండటంతో ఈ విషయం ప్రధాని దృష్టికి వెళ్ళింది.
దేశ వ్యాప్తంగా జనరిక్ మందుల అమ్మకాలు, వాడకాలను ప్రోత్సాహించే అంశంపై ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఇటీవల పలు రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్య నాథ్ దాస్ స్విమ్స్ లో జనరిక్ మందుల వాడకం గురించి ప్రధానికి వివరించారు. టీటీడీ చైర్మన్ కృషితో టీటీడీ వైద్యాలయాలన్నింటిలో జనరిక్ మందుల షాప్ లు ఏర్పాటు చేస్తున్న విషయం వివరించారు. దీనిపై ప్రధాని సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోని అన్ని పిహెచ్సీ లు, సి హెచ్సీ ల్లో అద్దె లేకుండా జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. జనరిక్ మందుల వాడకం వల్ల రోగులపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. ఈ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్య వంతులను చేయాలని సూచించారు.