ID CARDS TO SVIMS CORPORATION STAFF _ స్విమ్స్ లో రోగులకు మరింత మెరుగ్గా సేవలందించాలి- టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి

TIRUPATI, 12 APRIL 2023: JEO for Health and Education Smt Sada Bhargavi on Wednesday issued the ID cards to the outsourcing employees of SVIMS who have joined in Sri Lakshmi Srinivasa Manpower Corporation.

The event took place in the JEO (H&E) chamber. She issued cards to the 25 employees who joined in Corporation. Speaking on the occasion she said TTD EO Sri AV Dharma Reddy has formulated employee-friendly guidelines which includes Insurance Cover, Earn Leaves, Gratuity etc. “On the ID card you will get darshan along with your family, subsidy laddus and a total of 17 privileges to this category of employees”, she added.

Corporation CEO Sri Sesha Sailendra, SVIMS Director Dr Vengamma, AD PR Sri Rajasekhar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్విమ్స్ లో రోగులకు మరింత మెరుగ్గా సేవలందించాలి

– టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి

– కార్పొరేషన్ ఉద్యోగులకు గుర్తింపు కార్డుల జారీ ప్రారంభం

తిరుపతి, 12 ఏప్రిల్ 2023: స్విమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మరింత మెరుగ్గా సేవలందించాలని టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి కార్పొరేషన్ ఉద్యోగులను కోరారు. టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో చేరిన స్విమ్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తింపు కార్డుల జారీని జెఈఓ ప్రారంభించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన 25 మంది కార్పొరేషన్ ఉద్యోగులకు జెఈఓ చేతుల మీదుగా గుర్తింపు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ స్విమ్స్ లో వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న దాదాపు 1800 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనం ఇతర సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ లో విలీనం చేసినట్టు చెప్పారు. ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో కార్పొరేషన్ ఉద్యోగులకు మేలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఆర్జిత సెలవులు వర్తింపచేశామని, ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించామని, గ్రాట్యూటీ చెల్లిస్తామని తెలియజేశారు. అదేవిధంగా గుర్తింపు కార్డుతో సుపథం మార్గం ద్వారా  కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించామని, రూ.20 చొప్పున నెలకు 10 లడ్డూలు సబ్సిడీపై పొందే అవకాశం ఇచ్చామని తెలియజేశారు. మొత్తం 17 రకాల ప్రయోజనాలు వర్తింపచేశామన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సీఈఓ శ్రీ శేష శైలేంద్ర, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, జనరల్ మేనేజర్ శ్రీమతి ప్రసన్నలక్ష్మి, ఎడి(పిఆర్) శ్రీ రాజశేఖర్
తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.