KEEP HOTELS, EATERIES CLEAN AND SANITIZED- ADDL EO TO TIRUMALA HOTELIERS _ హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండాలి : టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirumala, 19 July 2021: TTD Additional Executive Officer Sri AV Dharma Reddy urged the owners of hotels and operators of eateries, shop keepers of Tirumala to ensure clean and sanitized premises so that Srivari devotees should not put to any sort of inconvenience.
Addressing the hotel owners, local shop keepers, operators of eateries and local residents at Asthana Mandapam on Monday, the TTD Additional EO said several institutions and individuals are coming forward to organise the provision of quality food services at affordable prices to Srivari devotees without profit motive at 15 locations in Tirumala.
He instructed that hotel operators should display tariff board, provide computerized billing and allow digital payments besides keeping premises clean and sanitized.
He said all food outlets should maintain emergency fire equipment, should not sub-lease besides following all regulations of segregation of dry and wet garbage.
The Additional EO said soon TTD will provide photo ID cards for all license holders after total scrutiny as it is alleged that some persons had illegally occupied some houses at Balaji Nagar.
He said all details of local residents of Tirumala will be computerized and they will be facilitated with a separate line at Alipiri checkpoint as some had raised a grievance of delay to be clubbed with pilgrims.
He said all the grievances raised by locals will be brought to the notice of Higher Authorities.
TTD Health Officer Dr Sunil Kumar, DyEO Sri Vijayasaradhi, VGO Sri Bali Reddy, hotel owners, shop keepers and locals were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండాలి : టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2021, జులై 19: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం హోటళ్ల నిర్వాహకులు, ఆస్థానమండపంలో స్థానికులు, దుకాణాల వ్యాపారులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హోటళ్ల నిర్వాహకుల సమావేశంలో అదనపు ఈవో మాట్లాడుతూ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన భోజనం అందించేందుకు తిరుమలలోని 15 ప్రాంతాల్లో లాభాపేక్ష లేకుండా హోటళ్లు నిర్వహించేందుకు పలువురు వ్యక్తులు, సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు. అన్ని హోటళ్లలో ధరల పట్టికలు కనిపించేలా ఏర్పాటుచేయాలని, కంప్యూటరైజ్డ్ బిల్ ఇవ్వాలని, డిజిటల్ చెల్లింపులను అనుమతించాలని, పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండాలని సూచించారు. హోటళ్లు, దుకాణాల్లో అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. లీజు పొందినవారు సబ్‌లీజుకు ఇవ్వరాదన్నారు. సేకరణకు వీలుగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలన్నారు.
ఆస్థానమండపంలో అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలలోని దుకాణాలు, హాకర్ లైసెన్సులు, బాలాజినగర్‌లోని ఇళ్లను కొంతమంది అనధికారికంగా పొందినట్లు సమాచారం ఉందని, కావున ప్రతి లైసెన్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి సక్రమంగా ఉన్నవారికి ఫొటో గుర్తింపుకార్డు మంజూరు చేస్తామన్నారు. స్థానికుల వివరాలన్నింటినీ కంప్యూటర్‌లో నమోదు చేస్తామని తెలిపారు. అలిపిరి చెక్‌పాయింట్ వద్ద భక్తులతో కలిసి చెక్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందని స్థానికులు విజ్ఞప్తి చేశారని, వీరికోసం ప్రత్యేక వరుస ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థానికులు పలు సమస్యలు తెలియజేశారని, తన పరిధిలో ఉన్నవాటిని వెంటనే పరిష్కరిస్తానని, మిగతా సమస్యలను ఈవో దృష్టికి, బోర్డు దృష్టికి తీసుకెళతామని వివరించారు.
ఈ సమావేశాల్లో టిటిడి ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, డెప్యూటీ ఈవో శ్రీ విజయసారథి, విజివో శ్రీ బాలిరెడ్డి, హోటళ్ల నిర్వాహకులు, దుకాణాల వ్యాపారులు, స్థానికులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది