131st JAYANTI RALLAPALLI ON JANUARY 23 _ జ‌న‌వ‌రి 23న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 131వ జ‌యంతి

Tirupati, 22 January 2024: TTD is organising the 131st Jayanti of Sri Rallapalli Anantakrishna Sharma on January 23, the sangeet and sahitya pundit who brought to light hundreds of Annamacharya sankeertans etched on copper plates.

 

The prestigious programme will be jointly held at Annamacharya kala Mandiram on Tuesday evening under auspices of Annamacharya project and HDPP.

 

Sri Anatakrishna Sharma, a native of Anantapur district worked as Telugu teacher at Maharaja college of Mysore for 38 years and was credited for naming public sector All India Radio as Akashvani.

 

He was appointed as head of Sri Venkateswara Oriental research institute by then EO of TTD Sri C Anna Rao and given the responsibility of reviving the Annamacharya sankeertans.

 

Sri Rallapalli had not only published the sankeertans from the copper plates format and also choreographed hundreds of them.

 

In 1979 he was appointed Asthana Vidhwan of TTD.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జ‌న‌వ‌రి 23న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 131వ జ‌యంతి

తిరుపతి, 2024 జ‌న‌వ‌రి 22: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సం కీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత, సాహిత్య విద్వాంసులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 131వ జ‌యంతి కార్యక్రమం జ‌న‌వ‌రి 23న మంగ‌ళ‌వారం జరుగనుంది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో 1893, జనవరి 23న జన్మించారు. మైసూరు మహారాజ కళాశాలలో 38 సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా సేవలందించారు. రేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టింది వీరే. వీరి ప్రతిభను గుర్తించి అప్పటి టీటీడీ ఈవో శ్రీ చెలికాని అన్నారావు 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను అప్పగించారు. అప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన సంకీర్తనలను పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారు. సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారు. శ్రీఅనంతకృష్ణశర్మను 1979, మార్చి 11న టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.