ఈ నెల 6న భోగ శ్రీనివాసునికి సహస్రకలశాభిషేకం

ఈ నెల 6న భోగ శ్రీనివాసునికి సహస్రకలశాభిషేకం

తిరుమల,  3 జూలై 2013 : ఈ నెల 6వ తారీఖున శ్రీవారి గర్భాలయంలో వెలసియున్న శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆలయ అర్చకులు ఆగమప్రోక్తంగా సహస్రకలశాభిషేకాన్ని నిర్వహించనున్నారు.

కాగా ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పల్లవ రాణి సామవాయి పెరుందేవి తిరుమలలో తొలిసారిగా రజత భోగ శ్రీనివాసమూర్తిని శ్రీవారికి కానుకగా సమర్పించిన చారిత్రాత్మక నేపధ్యాన్ని పురష్కరించుకుని ఆనాడు ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకాన్ని గత 7 సంవత్సరములుగా తితిదే ఆనవాయితీగా నిర్వహిస్తున్నది.

ఈ సందర్భంగా శనివారం జూలై 6వ తారీఖున ఉదయం 6.00 గంటల నుండి 8.00 గంటల నడుమ శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తికి అర్చక స్వాములు ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కాగా ఆనాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు యథావిధిగా జరుగుతాయి.
కార్యక్రమ పట్టిక

సమయం కార్యక్రమం

ఉ.3.00 గం. నుండి ఉ.3.30 గం. వరకు – సుప్రభాతం
ఉ.3.30 గం. నుండి ఉ.5.30 గం. వరకు – శుద్ధి,తోమాల(ఏకాంతం),కొలువు,పంచాగశ్రవణం, మొదటి అర్చన (సహస్రనామం-ఏకాంతం)
ఉ.5.30 గం. నుండి ఉ.6.00 గం. వరకు – మొదటి గంట, బలి, శాత్తుమొర
ఉ.6.00 గం. నుండి ఉ.8.00 గం. వరకు – ప్రత్యేక సహస్రకలశాభిషేకం (సర్కార్‌), రెండవ అర్చన (ఏకాంతం), రెండవ గంట
ఉ.8.00 గం. నుండి రా.7.00 గం. వరకు – సర్వదర్శనం
మ.12.00 గం. నుండి సా.4.30 గం. వరకు – కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, వసంతోత్సవం
సా.5.30 గం. నుండి రా.7.00 గం. వరకు – సహస్రదీపాలంకార సేవ, ఉత్సవమూర్తుల ఊరేగింపు
రా.7.00 గం. నుండి రా.8.00 గం. వరకు – రాత్రి కైంకర్యాలు, రాత్రి గంట

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.