TTD EO AND ADDITIONAL EO INSPECT GARUDA SEVA ARRANGEMENTS SEPARATELY _ గరుడసేవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో, అదనపు ఈవో

Tirumala, 16 October 2026: As part of the ongoing Srivari Navaratri Brahmotsavams in Tirumala, TTD Executive Officer Sri Muddada Ravichandra inspected the arrangements along four mada streets made for the Garuda Seva on Friday. 

Later, in the afternoon, TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary also inspected the facilities provided to devotees in the galleries.

The officials said that elaborate arrangements have been made to ensure that every devotee has a comfortable darshan of Sri Venkateswara Swamy and a clear view of the Garuda Vahana Seva.

They added that annaprasadam, drinking water and buttermilk are being distributed to devotees in a planned manner, while special attention is being paid to cleanliness and sanitation.

The officials also interacted with devotees who had arrived from different parts of the country and ascertained their feedback on the facilities. 

The devotees expressed immense satisfaction with the arrangements made by TTD and especially complimented the services of Srivari Sevaks.

Later, the Additional EO inspected the QR code system introduced at the vehicle parking area and gave necessary instructions to the officials concerned.

CVSO Sri K.V. Murali Krishna, several TTD officials and others participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

గరుడసేవ ఏర్పాట్లను వేర్వేరుగా పరిశీలించిన టీటీడీ ఈవో, అదనపు ఈవో

గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి

తిరుమల, అక్టోబరు 16, 2026: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవను పురస్కరించుకుని, గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉదయం, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి మధ్యాహ్నం వేర్వేరుగా పరిశీలించారు.

ప్రతి భక్తుడికి శ్రీవారి దర్శనం, వాహనసేవ వీక్షణం సౌకర్యవంతంగా ఉండేలా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఈవో, అదనపు ఈవో తెలిపారు. భక్తులకు ప్రణాళికాబద్ధంగా అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ అందించడంతోపాటు పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకోగా, టీటీడీ ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదనపు ఈవో వాహన మండపం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ విధానాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, పలువురు టీటీడీ అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.