CULTURAL TEAMS ENTHRALL DEVOTEES _ శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల్లో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

TIRUMALA, 19 SEPTEMBER 2023: Attractive cultural programs organised by TTD Dharmic Projects during the Srivari Vahana Sevas enthralled the devotees along the four Mada streets during the Chinna Vahana Seva held on Tuesday morning. 

In all, 217 artists belonging to Nine cultural teams from different states displayed their talents, captivating the devotees. The Udupi Mela presented by a 12 member troupe of Palimaru Matham of Udupi in Karnataka comprising drums and talas heightened the  devotional fervour. The Udupi team has been participating in the Srivari Brahmotsavams for the last fifteen years. This show was followed by a 30-member dance team of Puducherry which displayed Mahishasura Mardini Alankaram in Mohini Attam format.

Six teams of TTD’s Dasa sahitya project artists from Chennai,Salem and Srirangam presented Bharatanatyam, folk dance, tala bhajan and displayed Krishna Leela.

All Projects Programme Officer Sri Rajagopal, HDPP Secretary Dr Srinivasulu , Dasa Sahitya project Special Officer Sri Anandathirthacharyulu supervised the programmes.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల్లో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 19: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండ‌వ‌ రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చిన్న‌శేష‌ వాహ‌న సేవ‌లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 9 క‌ళాబృందాలలో 217 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు.

క‌ర్ణాట‌క ఉడిపిలోని శ్రీ పాలిమారు మ‌ఠంకు చెందిన 12 మంది బృందం ఉడిపి మెళం వాహ‌న సేవ‌కు మ‌రింత ఆధ్యాత్మిక అందాన్ని తెచ్చింది. వీరు డ్ర‌మ్స్‌, తాళాలు ల‌య‌బ‌ద్ధంగా వాయిస్తున్నారు. ఈ వాయిద్య ప్ర‌ద‌ర్శ‌న ఎంతో విన‌సొంపుగా ఉంటుంది. వీరు గ‌త 15 సంవ‌త్స‌రాలుగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉడిపి మెళం వాయిస్తున్నారు. పుదుచ్చేరికి చెందిన 30 మంది క‌ళాకారులు పంబి డ్యాన్స్‌, 23 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శించిన మోహిని ఆట్యం ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇందులో మ‌హిషాసుర మ‌ర్ధిని అలంకారంలో అమ్మ‌వారు రాక్ష‌సుడిని సంహ‌రించ‌డం, హిరణ్యకశిపుని చీల్చడంతో ప్రహ్లాదుడు నరసింహుడిని ప్రార్థిస్తున్న ఘ‌ట్టాలు భ‌క్తుల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేశాయి.

దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో చెన్నై,సెలం, శ్రీ‌రంగంకు చెందిన‌ 6 క‌ళా బృందాలు దాస సాహిత్య సంకీర్త‌న‌ల‌కు భ‌ర‌త నాట్యం, ఫోక్ డ్యాన్స్‌, తాళ భ‌జ‌న‌, కృష్ణ లీలలు ప్రదర్శించారు.

డిపిపి ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు, డిపిపి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థా చార్యులు ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.