జూన్‌ 4న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

జూన్‌ 4న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

తిరుపతి, మే 31, 2013: కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో స్వామివారి ఆలయాన్ని నిర్మించనుంది. ఈ ఆలయ నిర్మాణానికి జూన్‌ 4వ తేదీన భూమిపూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది.
జూన్‌ నాలుగో తేదీన రేవతి నక్షత్రం సిద్ధయోగంతో కూడిన ఉదయం 6.00 నుండి 7.00 గంటల మధ్య భూమిపూజ నిర్వహించనున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద కేంద్ర ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి దేవేరులకు ఆలయ నిర్మాణం జరుగనుంది. ఇక్కడ త్వరగా ఆలయ నిర్మాణం పూర్తిచేసి దక్షిణాది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలని తితిదే కృతనిశ్చయంతో ఉంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.