ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు


ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, మే 31, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.10 గంటలకు మిథున లగ్నంలో సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను మృదుమధురంగా ఆలపించారు. సాయంత్రం 7.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు పెద్దశేషవాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
 
బ్రహ్మోత్సవాల్లో జూన్‌ 3వ తేదీ సాయంత్రం 5.00 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు, హరికథ నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.