SOMA SKANDA ON TIRUCHI _ తిరుచ్చిపై సోమస్కందమూర్తి

TIRUPATI, 05 MARCH 2024: On the fifth day Sri Soma Skandamurty blessed His devotees on Tiruchi as a part of the annual Brahmotsavam in Sri Kapileswara Swamy temple in Tirupati.

Later Snapana Tirumanjanam was performed.

DyEO  Sri Devendra Babu and others participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుచ్చిపై సోమస్కందమూర్తి

తిరుప‌తి, 2024, మార్చి 05: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి తిరుచ్చిపై  అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

మహాదేవుడైన కపిలేశ్వరస్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరతాయని ఐతిహ్యం.

అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.