DEEPAVALI ASTHANAM IN LOCAL TEMPLES _ తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా దీపావళి ఆస్థానం

Tirupati, 27 Oct. 19: The traditional temple court,  Deepavali Asthanam was observed in TTD local temples at Tirupati. 

The asthanam was observed in Kodanda Rama Swamy temple in Tirupati on Sunday. 

While it was a complete delight to see the row of ghee lamps arranged in a traditional manner in the ancient temple of Sri Govindaraja Swamy in Tirupati for Deepavali Asthanam. 

JEO Sri P Basanth Kumar who took part in this religious fete described the fest as “Green Deepavali” as the ritual is celebrated in an eco-friendly manner by litting wiks in Mookullu filled with pure desi cow ghee. 

HH Sri Tirumala Pedda Jeeyangar Swamy and HH Sri Tirumala Chinna Jeeyangar Swamy also graced the fete that was held in the temple on Sunday evening. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా దీపావళి ఆస్థానం

తిరుపతి, 2019 అక్టోబ‌రు 27: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం దీపావళి సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం వైభవంగా జ‌రుగ‌నుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. 

ఈ సంద‌ర్భంగా జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ మాట్లాడుతూ భ‌క్తులు క‌లుష్య‌ర‌హిత దీపావ‌ళి జ‌రుపుకోవాల‌ని కోరారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు.  స్వామివారి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.
            
 ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి,  ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.