KUMBHABHISHEKAM OF SRI BRIHADEESWARALYAM HELD IN DHYANARAMAM _ వైభవంగా ధ్యానారామంలోని శ్రీ బృహదీశ్వరాలయ కుంభాభిషేకం

Tirupati, 08 March 2024: The inauguration and Kumbhabhishekam of Sri Brihadishwara Swamy Temple in Dhyanaramam in the premises of Sri Venkateswara Vedic University was done with grandeur on Friday wherein TTD Chairman Sri Bhumana Karunakara Reddy participated in the traditional puja. 

TTD built this temple with the funds of the Srivani Trust.

As part of the Kumbhabhishekam program Ganapati Puja, Punyahavachanam and Panchagavyaradhana were performed. 

After that they performed Rutvik Varanam, Mritsamgrahanam, Ankurarpanam, Vastu Homam, Ksheeradhivasam, Jaladhivasam, Dhanyadhivasam, Sayanadhivasam, Navratna and Dhatunyasam.

Murthyhoma, Moolamantra homas, Kalahomas and Shanti homas were organized as part of the ritual. 

After that Maha Purnahuti and Kumbhabhishekam Samprokshanam programs were organized.

 JEO Sri Veerabrahmam, Vedic University Vice Chancellor Acharya Rani Sadashivamurthy, Chief Engineer Sri Nageswara Rao, CAuO Shri Sesha Sailendra, Vedic University Registrar Acharya Radhagovinda Tripathi, faculty, students, devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా ధ్యానారామంలోని శ్రీ బృహదీశ్వరాలయ కుంభాభిషేకం

•⁠ ⁠పాల్గొన్న టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి

 తిరుప‌తి, 2024, మార్చి 08: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆవరణంలో గల ధ్యానారామంలోని శ్రీ బృహదీశ్వర స్వామి ఆల‌య కలశస్థాపన, కుంభాభిషేకం శుక్రవారం వైభవంగా జరిగింది. శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో టీటీడీ ఈ ఆల‌యాన్ని నిర్మించింది.

కుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా మొదటగా దైవానుజ్ఞ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన చేపట్టారు. ఆ తర్వాత రుత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, వాస్తు హోమం, పర్యజ్ఞీకరణ, శిఖరానికి క్షీరాధివాసం, జలాధివాసం, ధాన్యాధివాసం, శయ్యాధివాసం, నవరత్న, ధాతున్యాసాలు చేపట్టారు.

శిఖరస్థాపనలో భాగంగా మూర్తిహోమం, మూలమంత్ర హోమాలు, కళాహోమాలు, శాంతి హోమాలు నిర్వహించారు. ఆ తర్వాత మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, వేద విశ్వవిద్యాలయ ఉప‌కులపతి ఆచార్య రాణీ సదాశివమూర్తి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, సీఏఓ శ్రీ శేష శైలేంద్ర, వేద వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య రాధాగోవింద త్రిపాఠి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.