నాగలాపురంలో శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 28వ తేది నుండి మే 6వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవములు

తిరుపతి, 2010 ఏప్రిల్ 21: నాగలాపురంలో వెలసిన మత్స్యావతారుడైన శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 28వ తేది నుండి మే 6వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవములు కన్నుల పండుగగా జరుగుతాయి. ఏప్రిల్‌ 27వ తేదిన అంకురార్పణ జరుగుతుంది.

ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు ప్రతిరోజు క్రింది వాహనాలను అధిరోహించి భక్తులకు కనువిందైన దర్శన భాగ్యం కల్పిస్తారు.

తేది ఉదయం       సాయంత్రం
28-04-2010 ధ్వజారోహణం (ఉ. 8.45 గంటలకు) పెద్దశేష వాహనం
29-04-2010 చిన్నశేష వాహనం హంసవాహనం
30-04-2010 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
01-05-2010 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
02-05-2010 మోహిని అవతారం గరుడసేవ
03-05-2010 హనుమంత వాహనం గజవాహనం
04-05-2010 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
05-05-2010 రథోత్సవం (ఉ.7.20 నుండి 9.30 గంటల వరకు) అశ్వ వాహనం
06-05-2010 పల్లకీ ఉత్సవం ధ్వజావరోహణం
చక్రస్నానం (ఉ.9.00 నుండి 10.30 గంటల వరకు)

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.