బ్రాహ్మణపట్టులో టిటిడి ఉద్యోగుల‌కు ఇళ్ళ‌స్థ‌లాలు – ఈవో

బ్రాహ్మణపట్టులో టిటిడి ఉద్యోగుల‌కు ఇళ్ళ‌స్థ‌లాలు – ఈవో

తిరుపతి, 2010 ఏప్రిల్‌ 21: తిరుమల తిరుపతి దేవస్థానముల ఉద్యోగులు తమ ఇళ్ళస్థలాల విషయమై ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నందున వారి కలల్ని సాకారం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తానని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌ కృష్ణారావు తెలిపారు.

బ్రాహ్మణపట్టు భూమిని స్వాధీన పరచుకునే అంశంపై దేవాదాయ ధర్మాదాయ మంత్రి గారితో ఇ.ఓ. గారు మాట్లాడడం జరిగింది. తదనుగుణంగా భూమిని తక్షణం స్వాధీనపరచుకొనుటకు ఆదేశాలు సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది.

భవిష్యత్తులో తితిదే ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వరాదని, అదేవిధంగా వారి ఇంటి స్థలాలకు సంబంధించి రోడ్లు, తదితర అభివృద్ది పనులు ఉద్యోగులే భరించాలని,   పాలకమండలి చేసిన 591, 531 తీర్మానాలను పునఃపరిశీలనకు తదుపరి పాలకమండలి సమావేశానికి నివేదించి ఉద్యోగులకు పూర్తి న్యాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని, కనుక ఉద్యోగులు ఈ విషయమై ఎటువంటి అందోళన చెందవలసిన అవసరములేదని ఇ.ఓ ఉద్యోగులను కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.