Opening “e”-Darshan counter shortly in Tirupati _ తిరుపతిలో ఇ-దర్శన్ కౌంటర్లు
TIRUPATI, 22, APRIL, 2010: In the interest of the local people and visiting devotees Tirumala Tirupati Devasthanam (TTD) is planning to open an “e”-Darshan Counter in Tirupati shortly to book all Arjitha Sevas.
All Arjitha sevas like Arjitha Brahmothsavam, Astadalapada padmaradana, Kalyanotsavam, Nijapada Darsanam, Sahasradeepalankara seva, Suprabhatham, Unjal Seva, Vasonthotsavam and Visesha Pooja are available in the “e”-Darshan counter for the interest of the Devotees.
Such “e”-Darshan Counter had already been established across the country and thousands of devotees are availing of this facility in the booking of Arjitha sevas.
Presently, devotees utilising Rs.50/- darshan “Sudarsan” counters located in Tirupati at second choultry, Srinivasam, Bhudevi Complex, RTC Bus Stand, Srivari Sannidhi, Renigunta Information Centre respectively.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
తిరుపతిలో ఇ-దర్శన్ కౌంటర్లు
తిరుపతి, 2010 ఏప్రిల్ 21: స్థానికులు, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌలభ్యం మేరకు తిరుపతిలో తితిదే ఇ-దర్శన్ కౌంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నది.
ఈ ఇ-దర్శన్ కౌంటర్‌లో శ్రీవారి ఆర్జిత సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, అష్టదళ పాదపద్మారాధనసేవ, కల్యాణోత్సవం, నిజపాద దర్శనం, సహస్రదీపాలంకారసేవ, సుప్రభాతం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, విశేషసేవలకు సంబంధించిన సేవాటిక్కెట్లు దేశంలోని 70 ఇ-దర్శన్ కౌంటర్లవలె, తిరుపతిలో ఏర్పాటు చేయనున్న ఇ-దర్శన్ కౌంటర్‌లో భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.
అదేవిధంగా తిరుపతిలోని రెండవ సత్రం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, ఆర్.టి.సి. బస్టాండ్, శ్రీవారి సన్నిధి, రేణిగుంట సమాచారకేంద్రాలలో రు.50/-ల సుదర్శన టోకన్లు భక్తులకు ఇస్తున్న విషయం విధితమే.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.