‌SERVICE TO DEVOTEES IS SERVICE TO THE ALMIGHTY _ భక్తులకు సేవ చేస్తే భగవంతుడికి చేసిన‌ట్టే- ⁠ఎస్ఎల్ఎస్ఎంపిసి సీఈవో శ్రీ శేష‌శైలేంద్ర‌

Tirupati, 25 January 2024: Sri Sesha Shailendra, CEO of Sri Lakshmi Srinivasa Manpower Corporation urged its employees to serve devotees with utmost respect and decorum on par with their service to God. 

Participating in the certificate distributing event to the meritorious employees in connection with the 75th Republic Day celebrations, he gave away the certificates to 137 employees along with the Chief PRO Dr T Ravi. 

He said the manpower corporation with 6800 employees is been provided with several facilities on par with regular employees of TTD.

       

Participating as chief guest Dr T Ravi, the CPRO of TTD urged corporation employees to serve devotees with devotion and discipline.

He said that the former EO Sri KS Jawahar Reddy, present EO Sri AV Dharma Reddy and CEO of SLSMPC Sri Sesha Sailendra were responsible for the formation of the corporation providing job security to the employees.

SVETA Director Smt Prasanthi, AEO Smt Manemma, SVIMS AO Sri Babu and others were also present

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భక్తులకు సేవ చేస్తే భగవంతుడికి చేసిన‌ట్టే

•⁠ ⁠ఎస్ఎల్ఎస్ఎంపిసి సీఈవో శ్రీ శేష‌శైలేంద్ర‌

•⁠ ⁠గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా 137 మంది సిబ్బందికి ప్ర‌శంసాప‌త్రాలు

తిరుప‌తి, 25 జ‌న‌వ‌రి, 2024: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను భగవంతుడితో సమానంగా చూడాలని, వారితో గౌరవ మర్యాదలతో వ్యవహరించి మెరుగైన సేవలు అందించాలని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్(ఎస్ఎల్ఎస్ఎంపిసి) సీఈవో శ్రీ శేష‌శైలేంద్ర కోరారు. గ‌ణ‌తంత్ర దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని టీటీడీ, స్విమ్స్‌లోని వివిధ విభాగాల్లో ఉత్త‌మ‌ సేవ‌లందించిన 137 మంది సిబ్బందికి గురువారం తిరుపతిలోని శ్వేత భ‌వ‌నంలో ప్ర‌శంసాప‌త్రాలు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి అధ్య‌క్ష‌త వ‌హించిన శ్రీ శేష‌శైలేంద్ర మాట్లాడుతూ టీటీడీలోని వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనం ఇతర సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అప్పటి ఈవో శ్రీ జవహర్ రెడ్డి, ప్రస్తుత ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో కార్పొరేషన్ ఉద్యోగులకు మేలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఉద్యోగుల‌కు చ‌ట్ట‌బ‌ద్దంగా అన్ని ప్ర‌యోజ‌నాలు క‌ల్పించామ‌ని తెలియ‌జేశారు. కార్పొరేష‌న్‌లో దాదాపు 6800 మంది ఉద్యోగులు ఉన్నార‌ని, టీటీడీ ఉన్నంత‌వ‌ర‌కు ఈ సంస్థ ఉంటుంద‌ని వివ‌రించారు. కార్పొరేష‌న్ ఉద్యోగులు నిబ‌ద్ధ‌త‌తో, మ‌రింత బాధ్య‌త‌గా ప‌నిచేయాల‌ని ఆయ‌న కోరారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ ముఖ్య ప్ర‌జాసంబంధాల అధికారి డా. టి.ర‌వి మాట్లాడుతూ టీటీడీలో ఉద్యోగం చేయ‌డం పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని, కార్పొరేష‌న్ ఉద్యోగులు మ‌రింత అంకిత‌భావంతో, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విధులు నిర్వ‌హించాల‌ని కోరారు. టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి చొర‌వ తీసుకుని అడ‌గ‌కుండానే కార్పొరేష‌న్ ఉద్యోగుల‌కు వేత‌న పెంపుతోపాటు అనేక ప్ర‌యోజ‌నాలు క‌ల్పించార‌ని తెలియ‌జేశారు. ఇటీవ‌ల కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో అర్హ‌త ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి ప్ర‌తిభ‌గ‌ల‌వారిని ఎంపిక చేశార‌ని, సంస్థ అభివృద్ధిప‌థంలో న‌డిచేందుకు ఉద్యోగులు త‌మ‌వంతు స‌హ‌కారం అందించాల‌ని కోరారు.

శ్వేత డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి మాట్లాడుతూ రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తోపాటు కార్పొరేష‌న్ ఉద్యోగుల‌కు కూడా నైపుణ్యాలు పెంచేందుకు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు.

ఈ కార్యక్రమానికి టీటీడీ ఎపిఆర్వో కుమారి పి.నీలిమ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. కార్పొరేషన్ డెప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ‌మ‌తి మ‌ణెమ్మ‌, స్విమ్స్ జిఎం శ్రీ బాబు, సూపరింటెండెంట్ శ్రీ‌మ‌తి జ్యోతి, కార్పొరేష‌న్ సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.