DEVELOP PARAKAMANI MANAGEMENT SYSTEM APP -TTD EO _ పరకామణి మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్‌ను త్వరగా అభివృద్ధి చేయండి

SPONSOR REMAINING LADDU COUNTERS TOO-EO TO BANKERS

 

TIRUPATI, 11 MAY 2023: TTD EO Sri AV Dharma Reddy directed the IT wing officials of TTD to develop Parakamani Management System app exclusively to carry out the foreign currency validation.

 

Reviewing on the Parakamani activities with the DyEO Parakamani and Bank officials representing various banks at Sri Padmavathi Rest House in Tirupati on Thursday the EO directed the concerned to lift the pending currency notes and coins on a fast pace. The EO also directed the IT GM Sri Sandeep Reddy to develop an exclusive Parakamani Management System Application for the clearance of Foreign Currency and handing them over to the SBI in a transparent manner as per the guidelines of MHA. 

 

Later the EO also instructed to clear the pending soiled, uncurrent notes and asked the respective bankers to arrange to lift them without any delay.

 

Earlier a review meeting on Laddu Counters also took place along with the bankers. Apart from the existing 30 counters which are being sponsored by various banks, the EO asked the bankers to sponsor the remaining counters also. 

 

JEO for Health and Education Smt Sada Bhargavi, CEO SVBC Sri Shanmukh Kumar, FACAO Sri Balaji, Additional FACAO,Sri Raviprasadu, CAuO Sri Sesha Sailendra, DyEOs Sri Rajendra Kumar, Sri Lokanatham, AEO Potu Sri Srinivasulu, representatives from various banks and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

పరకామణి మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్‌ను త్వరగా అభివృద్ధి చేయండి

– మిగిలిన ల‌డ్డూ కౌంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌కు బ్యాంకులు ముందుకు రావాలి

– టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి

తిరుమల, 2023 మే 11: టీటీడీ వద్ద వున్న విదేశీ కరెన్సీ కొరకు ప్రత్యేకంగా పరకామణి మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్‌ను రూపొందించాలని ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి టీటీడీ ఐటీ విభాగం అధికారులను ఆదేశించారు.

తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో గురువారం వివిధ బ్యాంకులకు చెందిన బ్యాంకు అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ టీటీడీలో నిల్వ ఉన్న విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు అనుమతించినట్లు తెలిపారు.
టీటీడీ వద్ద వున్న విదేశీ కరెన్సీని భారతీయ స్టేట్ బ్యాంకు కు కేంద్ర హోం శాఖ మరియు ఎస్ బి ఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకతతో చేర్చేందుకు పరకామణి మేనేజ్మెంట్ సిస్టం యాప్ ను త్వరగా రూపొందించాలని ఐ టి వి భాగాధిపతి శ్రీ సందీప్ రెడ్డి ని ఆదేశించారు.

అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న కరెన్సీ నోట్లు, నాణ్యాలను త్వరితగతిన తరలించాలని చేయాలని సంబంధిత బ్యాంకు అధికారులను కోరారు.

అనంతరం ఈఓ పరకమణిలో ఉన్న పాడైన మరియు కట్‌ నోట్లను ఎలాంటి జాప్యం లేకుండా వాటిని తరలించందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత బ్యాంకర్లను కోరారు.

అంతకుముందు బ్యాంకర్లతో కలిసి లడ్డూ కౌంటర్లపై సమీక్షా సమావేశం జరిగింది. ఇప్పటికే వివిధ బ్యాంకులు స్పాన్సర్ చేస్తున్న 30 కౌంటర్లు కాకుండా మిగిలిన కౌంటర్లను కూడా స్పాన్సర్ చేయాలని బ్యాంకర్లను ఈఓ కోరారు.

ఈ సమావేశంలో జేఈవో (హెచ్ & ఇ )శ్రీమతి సదా భార్గవి, సిఈవో ఎస్‌విబిసి శ్రీ షణ్ముఖ్‌కుమార్, ఎఫ్‌ఏసీఏవో శ్రీ బాలాజీ, అదనపు ఎఫ్‌ఏసిఏవో, శ్రీ రవిప్రసాద్, సిఏయూ వో శ్రీ శేష శైలేంద్ర, డిప్యూటీ ఈఓలు శ్రీ రాజేంద్రకుమార్, శ్రీ లోకనాథం, ఏఈవో (పోటు) శ్రీ శ్రీనివాసులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.