GOW- MANDIRAM IN TWO MONTHS- TTD BOARD CHIEF SRI YV SUBBA REDDY _ రెండు నెలల్లో గోమందిరం నిర్మాణం : ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirupati, 9 Jun. 20:  The construction of Gow- Mandiram and Go-Tulabhara Mandiram near Alipiri Padala Mandapam will be completed in two months, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

The TTD chairman along with the TTD board member Sri Sekhar Reddy inspected the progress of construction works of the twin buildings on Tuesday.

Speaking to media persons later, the TTD Chairman said the works of the new Mandiram and Bhavan has taken up with the contribution from some donors and TTD board members but was delayed by three months due to Corona lockdown.

He said TTD plans to make arrangements for devotees to worship the Holy cows before going to Tirumala for Srivari darshan.

He said that in Gow Tulabharam Bhavan, devotees could donate feed and grass as per the weight of a cow to redeem their vow of Godaanam. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రెండు నెలల్లో గోమందిరం నిర్మాణం : ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి, 09 జూన్ 2020:  అలిపిరి పాదాల మండపం సమీపంలో దాత‌ల స‌హ‌కారంతో నిర్మిస్తున్న గో మందిరం, గో తులాభారం భవనాల నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ శేఖర్ రెడ్డి, శ్రీ కృష్ణమూర్తి తో కలసి గోమందిరం, గోతులాభారం భవనాలను పరిశీలించారు.        

ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొందరు ధర్మకర్తల మండలి సభ్యులు, దాతలు ముందుకు వచ్చి టిటిడి ఆధ్వర్యంలో ఈ భవనాలు నిర్మిస్తున్నారని చెప్పారు. కరోనా వల్ల మూడు నెలలు ఈ పనులు ఆగిపోయాయని, మరో రెండు నెలల్లో పూర్తి చేసేలా పని చేస్తున్నట్లు అధికారులు చెప్పారన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు మొదట గోవు పూజచేసుకుని వెళ్లేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే గోవు  బరువును బట్టి దానికి దాణా లేదా మేత విరాళంగా ఇచ్చే భక్తుల కోసం గోతులాభారం భవనం కడుతున్నట్లు తెలిపారు. భక్తుల కోసం 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

టిటిడి ఎస్ఈ శ్రీ రమేష్ రెడ్డి, డెయిరీఫామ్ డైరెక్టర్ శ్రీ హరినాథ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.