NO SHORTAGE OF AGARBATHI PACKS AT TTD _ భక్తులకు అగరబత్తుల కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు
1.30 LAKH PACKS AVAILABLE FOR DEVOTEES
Tirupati, October 14, 2026: TTD has clarified that there is no shortage of agarbathi packs for devotees during the Srivari Navaratri Brahmotsavams. A stock of 1.30 lakh packs is currently available with TTD.
Reports on social media claiming that the agarbathi manufacturing unit at SV Gosamrakshana Shala in Tirupati has been closed are false.
The five-and-a-half-year contract with Darshan International, Bengaluru, has ended. However, the contract has been extended until October 31, 2026, to ensure continued supply. Agarbathi production has been continuing under the company’s supervision since October 1, with the same workers.
TTD has assured devotees that production is continuing as usual and sufficient stocks are available to meet their needs.
TTD appealed to the public not to spread unverified information that may hurt devotees’ sentiments. Media organisations are requested to verify facts with the concerned officials before publishing or broadcasting such reports.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
భక్తులకు అగరబత్తుల కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు
టీటీడీ వద్ద 1.30 లక్షల ప్యాకెట్ల నిల్వలు
తిరుపతి, 2026 అక్టోబరు 14: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల అవసరాలు, విక్రయాలకు సరిపడా 1.30 లక్షల అగరబత్తుల ప్యాకెట్లు టీటీడీ వద్ద అందుబాటులో ఉన్నాయని టీటీడీ వెల్లడించింది.
తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలలో నిర్వహిస్తున్న అగరబత్తుల తయారీ కేంద్రాన్ని మూసివేసినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
గతంలో అగరబత్తుల తయారీ బాధ్యతలు నిర్వహించిన బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థకు ఐదున్నర సంవత్సరాల కాంట్రాక్టు గడువు పూర్తయింది. అయితే, ఆ సంస్థ ఉత్పత్తుల సరఫరా కోసం అక్టోబరు 31వ తేదీ వరకు మరో నెలపాటు గడువును పొడిగించారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 1వ తేదీ నుంచి దర్శన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అగరబత్తుల తయారీ కొనసాగుతోంది.
గతంలో పనిచేసిన కార్మికులతోనే తయారీ కేంద్రం కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, ప్రతిరోజూ అగరబత్తుల తయారీ జరుగుతోందని టీటీడీ తెలిపింది. భక్తుల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాలపై అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఏదైనా సమాచారం ప్రసారం చేసే ముందు వాస్తవాలను సంబంధిత అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించింది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.


