ANKURARPANA HELD _ శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

TIRUPATI, 04 MAY 2023: The Ankurarpana for Patra Pushpa Yagam at Sri Kapileswara Swamy temple was observed on Thursday.

On Friday between 10am and 12noon, the floral bath will be rendered to the utsava deities.

Deputy EO Sri Devendra Babu, AEO Sri Parthasarathy and other temple staff, archakas were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2023 మే 04: తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో శుక్రవారం జరుగనున్న ప‌త్ర‌పుష్పయాగానికి గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, నవకలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.

మే 5న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వ‌ర‌కు శ్రీ సోమ‌స్కంద‌మూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవర్లకు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. ఉద‌యం 10 నుండి మద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్రపుష్ప‌యాగ మ‌హోత్స‌వం జ‌రుగ‌నుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి ప‌లుర‌కాల పుష్పాలు, ప‌త్రాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స్వామివారి తిరువీధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

ఆలయంలో ఫిబ్ర‌వ‌రి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్స‌వాల్లో అర్చ‌క ప‌రిచార‌కులు, భ‌క్తుల వ‌ల్ల తెలియ‌క జ‌రిగిన పొర‌బాట్ల‌కు ప్రాయ‌శ్చిత్తంగా ప‌త్రపుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.