SRI MALAYAPPA SWAMY BLESSES DEVOTEES ON GODDESS SARASWATHI ON HAMSA VAHANAM _ హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి

VEENA IN HAND, THE LORD SYMBOLISES KNOWLEDGE AND WISDOM

CULTURAL PERFORMANCES ADD COLOUR TO THE PROCESSION

Tirumala, October 13, 2026: On the second day of the Srivari Navaratri Brahmotsavams on Tuesday night, Sri Malayappa Swamy blessed devotees on the Hamsa Vahanam, adorned as Goddess Saraswathi with a veena in His hands.

The divine appearance of the Lord as the embodiment of knowledge, wisdom and learning captivated devotees. Cultural performances by groups from various states added splendour to the grand procession along the four Mada Streets. Large numbers of devotees witnessed the vahana seva and sought the blessings of the Lord.

Hamsa Vahanam – Symbol of Wisdom and Discernment

The swan symbolises knowledge and spiritual discernment. According to traditional belief, its ability to separate milk from water represents the power to distinguish between truth and illusion. The Upanishads describe spiritually enlightened souls as Paramahamsas. The Hamsa Vahanam signifies the Lord’s blessings in removing ego and guiding devotees towards wisdom, spiritual realisation and Brahma Pada.

Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Sri Muddada Ravichandra, Additional EO Sri C.H. Venkaiah Chowdary, Board Members Sri Bhanu Prakash Reddy and Smt. Panabaka Lakshmi, CVSO Sri Murali Krishna and other officials participated in the vahana seva.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి

వీణాధారిగా జ్ఞానప్రదాతగా దివ్యదర్శనం

మాడ వీధుల్లో అలరించిన కళాబృందాల ప్రదర్శనలు

తిరుమల, అక్టోబరు 13, 2026: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధరించి, సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. విద్య, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా వీణాధారిగా అలంకృతులైన స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

హంస వాహనం – జ్ఞానానికి, వివేకానికి ప్రతీక

హంస జ్ఞానానికి, వివేకానికి ప్రతీకగా నిలుస్తుంది. పాలను, నీటిని వేరు చేయగలదనే సంప్రదాయ భావన వివేకశక్తిని సూచిస్తుంది. ఇది ఆత్మానాత్మ వివేచనకు సంకేతం. పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహనీయులను ఉపనిషత్తులు ‘పరమహంసలు’గా అభివర్ణిస్తాయి. భక్తుల్లో అహంభావాన్ని తొలగించి, జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తూ బ్రహ్మపద ప్రాప్తికి అనుగ్రహించే దివ్యవాహనంగా హంస వాహనాన్ని ఆధ్యాత్మిక సంప్రదాయం కీర్తిస్తుంది.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మి, సీవీఎస్‌వో శ్రీ మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.