SPIRITUAL FERVOUR MARKS SRIVARI BRAHMOTSAVAMS _ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు
Tirumala, October 13, 2026 ; The religious and devotional programmes organised by TTD Hindu Dharma Prachara Parishad and other religious projects on Tuesday, as part of the Srivari Navaratri Brahmotsavams, created a spiritually vibrant atmosphere in Tirumala.
The programmes featured Nadaswaram, Vedic chanting, Vishnu Sahasranama Parayanam, devotional music, Annamacharya Sankeertans and Harikatha, attracting a large number of devotees.
NADASWARAM AND VEDIC PROGRAMMES AT NADA NEERAJANAM
At the Nada Neerajanam stage, the team led by Sri Kesanna and Sri Nageswara Rao presented Nadaswaram from 4.30 am to 5.30 am under the auspices of SV College of Music and Dance. From 5.30 am to 6.30 am, the Sri Venkateswara Vedic University’s Vedic institution presented a Vedic discourse. Devotional music was held at the venue from 5 pm to 6.30 pm.
DEVOTIONAL MUSIC AND RELIGIOUS DISCOURSE AT ASTHANA MANDAPAM
At Asthana Mandapam, Smt. Krishnaveni’s team from Tirupati performed Vishnu Sahasranama Parayanam from 7 am to 8 am. Smt. Archana Kulkarni’s team from Bengaluru presented devotional music from 10 am to 11.30 am, followed by a religious discourse by Sri Ramanujacharyulu from Tenali from 11.30 am to 12.30 pm.
ANNAMACHARYA SANKEERTANS AND HARIKATHA
From 4 pm to 5.30 pm, the Chaitanya Brothers team from Visakhapatnam enthralled devotees with melodious Annamacharya Sankeertans. Later, from 5.30 pm to 7 pm, Sri Padmanabha Sharma’s team from Vijayawada presented Harikatha, conveying devotional and spiritual messages.
The programmes filled Tirumala with the divine sounds of Vedic chants and devotional music, allowing devotees to experience the spiritual splendour of the Srivari Navaratri Brahmotsavams.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు
నాదస్వరం.. వేదఘోష.. అన్నమయ్య సంకీర్తనలు.. హరికథతో భక్తిమయమైన తిరుమల
తిరుమల, అక్టోబరు 13, 2026 ; తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాదస్వర నాదాలు, వేదమంత్ర ఘోష, విష్ణు సహస్రనామ పారాయణం, భక్తి సంగీతం, అన్నమయ్య సంకీర్తనలు, హరికథతో తిరుమల కొండ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.
నాదనీరాజనం వేదికపై నాదస్వర, వేద కార్యక్రమాలు
తిరుమల నాదనీరాజనం వేదికపై ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో శ్రీ కేశన్న, శ్రీ నాగేశ్వరరావు బృందం నాదస్వర ప్రదర్శన నిర్వహించింది. ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేదసందేశం అందించారు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
ఆస్థాన మండపంలో భక్తి సంగీతం.. ధార్మిక ఉపన్యాసం
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కృష్ణవేణి బృందం విష్ణు సహస్రనామ పారాయణం చేసింది. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీమతి అర్చన కులకర్ణి బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించింది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తెనాలికి చెందిన శ్రీమాన్ రామానుజాచార్యులు ధార్మిక ఉపన్యాసం చేశారు.
అన్నమయ్య సంకీర్తనలు.. హరికథతో భక్తిరసామృతం
సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు విశాఖపట్నానికి చెందిన శ్రీ చైతన్య బ్రదర్స్ బృందం మధురమైన అన్నమయ్య సంకీర్తనలతో భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు విజయవాడకు చెందిన శ్రీ పద్మనాభశర్మ బృందం హరికథా గానం ద్వారా భక్తి, ధర్మ సందేశాలను అందించింది.
ఈ కార్యక్రమాలను పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తిగా వీక్షించారు. వేదఘోష, హరినామ స్మరణ, భక్తి సంగీతంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియగా, భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాల దివ్యానుభూతిని ఆస్వాదించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.







