STUDENTS LAUDED _ 10వ త‌ర‌గ‌తి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన‌ విద్యార్థుల‌ను అభినందించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirupati, 25 April 2024:TTD EO Sri. AV. Dharma Reddy congratulated the students of TTD Educational institutions who secured the best marks in the 10th class examinations.

On this occasion, he felicitated and blessed the students studying in TTD schools who obtained the best results in the 10th class (2023-24) public examinations at the TTD administration building on Thursday.

Similarly, JEOs Smt. Gauthami (H&E), Sri Veerabraham TTD Education Officer Dr. Bhaskar Reddy felicitated the students who stood first in the TTD school and scored more than 570 marks.

Students from Sri Kodandaramaswamy English High School, Tirupati, SV High School, Sri Padmavathi Boys High School, Sri Govindaraja Swamy English High School, Tirumala SV High School, Sri Kapileswara Swamy High School, SV Oriental High School, SV Badhira School, SV Bhimavaram, Deaf school, a total of 20 students received mementoes over the hands of EO.

In all the schools managed by TTD, 98 percent passed the 10th class public examinations for the academic year 2023-2024, 100 percent passed in SV Badhira Pathshala in Tirupati and SV Badhira School in Bhimavaram, TTD Education Officer Dr Bhaskar Reddy said.

Head Masters and students of TTD High Schools participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

10వ త‌ర‌గ‌తి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన‌ విద్యార్థుల‌ను అభినందించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుపతి, 2024 ఏప్రిల్ 25: టీటీడీ పాఠశాలల్లో చదువుతూ 10వ త‌ర‌గ‌తి ( 2023-24) పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు టీటీడీ పరిపాలన భవనంలో గురువారం టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి మెమొంటోలను బహూకరించి అభినందించి, ఆశీర్వదించారు.

అదేవిధంగా జేఈవోలు శ్రీమతి గౌతమి (విద్య మరియు వైద్యం), శ్రీ వీరబ్రహ్మం టీటీడీ విద్యాశాఖాధికారి డా.భాస్కర్ రెడ్డి టీటీడీ పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచిన మరియు 570కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు.

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాలలో ఆరుగురు, ఎస్వీ ఉన్నత పాఠ‌శాల నుండి నలుగురు, శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల నుండి నలుగురు, శ్రీ గోవిందరాజ స్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాల, తిరుమల ఎస్వీ ఉన్నత పాఠశాల, శ్రీ కపిలేశ్వర స్వామి ఉన్నత పాఠశాల, ఎస్వీ ఓరియంటల్ ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ బ‌ధిర పాఠ‌శాల‌, భీమవరంలోని ఎస్వీ బ‌ధిర పాఠ‌శాల‌ నుంచి ఒక్కొక్క విద్యార్థి చొప్పున మొత్తం 20 మంది విద్యార్థులు ఈవో చేతుల మీదగా మెమొంటోలు అందుకున్నారు.

టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న అన్ని పాఠశాలల్లో 2023 -2024 విద్యా సంవ‌త్స‌రం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 98 శాతం, తిరుప‌తిలోని ఎస్వీ బ‌ధిర పాఠ‌శాల‌, భీమవరంలోని ఎస్వీ బ‌ధిర‌ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని టీటీడీ విద్యాశాఖాధికారి డా. భాస్కర్ రెడ్డి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.