READY E-M BOOK SOFTWARE BY NOVEMBER 15- JEO _ 15వ తేదీకి ఈ- ఎం బుక్ సాఫ్ట్వేర్ సిద్ధం కావాలి

Tirupati, 03, November 2021: TTD JEO Sri Veerabrahmam has directed IT officials on Wednesday to ready the e-M book software to facilitate tracking engineering works progress and bill payments etc.

Addressing a review meeting of Engineering and IT department officials at the TTD Administrative Buildings, the JEO said if the M Book Software app is ready by then it will be put into pilot implementation immediately and the concerned AEs could update ongoing works from the project site itself.

He advised Engineering officials to coordinate with TCS officials if they find any snags in the M Book app.

He also enquired on the ongoing works at Bhubaneswar and Seethampeta and also instructed officials to take up repairs of TTD Kalyana Mandapams as and when necessary.

SE-3 Sri Satyanarayana, SE Electrical Sri Venkateshwarlu, Deputy CE Sri Prasad and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

15వ తేదీకి ఈ- ఎం బుక్ సాఫ్ట్వేర్ సిద్ధం కావాలి -అధికారులకు జెఈవో
శ్రీ వీరబ్రహ్మం ఆదేశం

తిరుపతి 3 నవంబరు 2021:  ఇంజినీరింగ్ పనుల ప్రగతి, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయడానికి ఉద్దేశించిన ఈ ఎం బుక్ సాఫ్ట్వేర్ తయారీ పనులు నవంబరు 15వ తేదీకి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

టీటీడీ పరిపాలనా భవనం లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన ఇంజినీరింగ్, విద్యుత్ విభాగం అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ ఎం బుక్ సాఫ్ట్వేర్ 15వ తేదీకి పూర్తి అయితే ప్రయోగాత్మకంగా అమలు చేయాలని చెప్పారు. పని జరుగుతున్న ప్రదేశం నుంచే సంబంధిత ఎఈ లు ట్యాబ్ ద్వారా వివరాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇందులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సరిచేసుకోవడానికి టిసీఎస్ సంస్థ తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
భువనేశ్వర్, సీతంపేట లో జరుగుతున్న ఆలయాల నిర్మాణం పనుల ప్రగతి తెలుసుకున్నారు. కళ్యాణమండపాల.మరమ్మతులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఎస్ఈ – 3 శ్రీ సత్యనారాయణ, విద్యుత్ విభాగం ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటి సిఈ శ్రీ ప్రసాద్ తో పాటు ఈ ఈ లు, డి ఈ లు ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది