150th Jayanthi Celebrations of SWAMY VIVEKANANDA _ మానవాళికి స్ఫూర్తిదాయకం వివేకానంద : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
TIRUPATI, 12 Jan 2013: TTD Executive Officer Sri L.V.Subramanyam Garlanded the statue of Swamy Vivekananda on the occasion of 150th Jayanthi Celebrations opp Ruia Hospital Cirlce in Tirupati on Saturday morning.
TTD JEO Sri K.S.Sreenivasa Raju, CV&SO Sri GVG Ashok Kumar, TTD Senior Officers and others were present on the occassion.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మానవాళికి స్ఫూర్తిదాయకం వివేకానంద : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, జనవరి 12, 2013: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం పట్ల అపారజ్ఞానం గల స్వామి వివేకానంద మానవాళికి స్ఫూర్తిదాయకమని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం కొనియాడారు. స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని శనివారం తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాల ఎదురుగా గల ఆయన విగ్రహానికి ఈవో పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తితిదే ఈవో విలేకరులతో మాట్లాడుతూ 39 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని వీడిన స్వామి వివేకానంద విశ్వశాంతి కోసం పాటుపడ్డారన్నారు. ఆధ్యాత్మిక భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో వివేకానందుడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారని మహాత్మాగాంధీ స్వయంగా తెలిపారని వివరించారు. మన సనాతన ధార్మిక విలువలు, భారతీయతను తెలుసుకోవాలంటే ఆయన రచనలు తప్పక చదవాలని పిలుపునిచ్చారు. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా అధైర్యపడకూడదని ఆయన ప్రపంచానికి నేర్పారని ఈవో తెలిపారు.
అంతకుముందు తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాస రాజు, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.