TTD PRESENTS SILKS TO SIMHACHALAM TEMPLE _ సింహాచలం అప్పన్నకు టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ
సింహాచలం అప్పన్నకు టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ తిరుమల, 2024 మే 10: ప్రముఖ పుణ్యక్షేత్రమైన విశాఖపట్నం సమీపంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి(అప్పన్న) టీటీడీ తరపున శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం శుక్రవారం పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తరుపున శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలోని అన్ని నరసింహస్వామి క్షేత్రాల్లో సింహాచలం అతి ప్రాచీనమైనదని, స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. సింహగిరిపై […]
