2068 TEMPLES COMING UP UNDER SRIVANI FUNDS _ శ్రీవాణి ట్రస్టు నిధులతో 2068 ఆలయాల నిర్మాణం

TO BE COMPLETED IN ANOTHER SIX MONTHS

Rs.130CR TOWARDS THE RENOVATION OF ANCIENT 150 HISTORICAL TEMPLES

DENIES DIVERSION OF SRIVANI FUNDS 

TIRUMALA,  23 JANUARY 2023:  Sri Venkateswara Alaya Nirmana Trust(SRIVANI) was commenced by TTD in 2019 with an aim to construct small temples in SC, ST, BC, fishermen colonies and also to renovate the ancient temples as a part of TTD’s mission of taking forward Hindu Sanatana Dharma in a big way, said TTD EO Sri AV Dharma Reddy.

During a media conference arranged at Annamaiah Bhavan in Tirumala, the EO elaborated on various issues which were misinterpreted on various social media platforms and by a section of media misleading the devotees. 

Condemning the allegations that SRIVANI Trusts are diverted to pay the salaries of TTD employees and also to state government programmes, he said, the funds from SRIVANI Trust are totally utilized in constructing temples in backward areas and in renovating the age-old temples across the state. 

Giving the statistics he said, at present 2068 temples are under construction in different stages which also includes temples in the states of Telangana, Karnataka and Pondicherry. In a phased manner we will extend the construction activity to other states also in future”, he maintained.

Elaborating further he said, among these temples, 320 are being constructed with the co-operation of Samarasata Seva Foundation (SSF) at a cost of Rs.32 crore while the construction of another 932 temples will be taken up with AP Endowments department at Rs.100 crore approximately.

 “Besides, we have received another 667 applications which will be scrutinised and construction will be taken up accordingly. Apart from these temples, another 150 ancient temples are under innovation at a cost of Rs.130 crore.

The EO also said, for Dhoopa-Deepa-Naivedyam activities in these temples, TTD has released Rs. 12.50 crore. A local committee was also formed to look after the affairs of these temples and every month, the amount will be sent to the Committee’s account. We also have a separate Account for SRIVANI Trust and Social Audit as well”, he maintained.

TTD JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవాణి ట్రస్టు నిధులతో 2068 ఆలయాల నిర్మాణం 
 
– ఇప్పటివరకు అందిన విరాళాలు రూ.650 కోట్లు 
– నిధులు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదు
– సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మకండి 
– మీడియా సమావేశంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
 
తిరుమల, 23 జనవరి, 2023: శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో కలిపి మొత్తం 2,068 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హిందూ ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి)ను 2019లో ఏర్పాటుచేసినట్టు చెప్పారు. లక్ష రూపాయల లోపు విరాళం అందించే దాతలకు కూడా ప్రయోజనాలు వర్తింపచేయాలనే ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించే దాతలకు ఒక బ్రేక్‌ దర్శన టికెట్‌ జారీ చేస్తున్నామని వివరించారు. ఈ ట్రస్టు నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు.
 
శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటివరకు దాతల నుండి రూ.650 కోట్ల విరాళాలు సమకూరాయని తెలిపారు. సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో 2019వ సంవత్సరానికి ముందు 502 ఆలయాలు నిర్మించినట్టు వెల్లడించారు. అనంతరం ఈ ఫౌండేషన్‌ సహకారంతో 320 ఆలయాల నిర్మాణానికి రూ.32 కోట్ల శ్రీవాణి నిధులు మంజూరుచేశామని, వీటిలో 110 ఆలయాలు ఒకనెలలో, 210 ఆలయాలు 6 నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. రాష్ట్ర దేవాదాయ శాఖ సౌజన్యంతో వెనుకబడిన ప్రాంతాల్లో 932 ఆలయాల నిర్మాణానికి సుమారు రూ.100 కోట్లు కేటాయించామని, దశలవారీగా ఇప్పటివరకు రూ.25 కోట్లు మంజూరుచేశామని వివరించారు. 
 
అదేవిధంగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 150 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇందుకోసం రూ.130 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.71 కోట్లు విడుదల చేశామని తెలియజేశారు. ఈ విధంగా 1402 ఆలయాల నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందన్నారు. మరో 667 ఆలయాల నిర్మాణానికి వినతులు పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే వీటిని ఖరారు చేసి నిర్మాణాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతినెలా ఆలయ కమిటీ బ్యాంకు అకౌంట్‌లో రూ.5 వేలు జమ చేస్తామని, ఇందుకోసం రూ.12.50 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల నిర్వహణకు గాను ప్రతినెలా రూ.2 వేలు ఆలయ కమిటీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్టు వివరించారు. ఆలయాల నిర్మాణం జరుగుతున్నపుడు, పూర్తయిన తరువాత ఆలయ నిర్వహణను టిటిడి బృందం తరచూ తనిఖీ చేస్తుందని తెలిపారు. 
 
కాగా, శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి 50 శాతం నిధులను టిటిడి జనరల్‌ అకౌంట్‌కు బదిలీ చేస్తున్నారని, ఆదాయం కోసమే శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తున్నారని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటు ఉందని, అందులోనే విరాళాలు జమ అవుతాయని చెప్పారు. టిటిడి నుండి సొమ్ము  ప్రభుత్వానికి  అందే ప్రసక్తే లేదన్నారు. మరింత ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్‌ దర్శన టికెట్లను 1000కి తగ్గించడం జరిగిందన్నారు. ఇందులో 750 టికెట్లు ఆన్‌లైన్‌లో, 250 టికెట్లు ఆఫ్‌లైన్‌లో రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేస్తున్నట్టు చెప్పారు.
 
మీడియా సమావేశంలో టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.