SRI RAMACHANDRAMURTHY IN SHIVADHANURBHANGALAKARAM _ శివధనుర్భంగాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి రాజసం

Vontimitta, 22 April 2024: As part of Sri Kodandarama Swamy Brahmotsavam at Vontimitta in YSR Kadapa district, Sri Rama blessed His devotees in Shiva Dhanurbhangalakaram on the sixth morning.

Devotees offered Harati at every step.

Shivadhanurbhangalkaram commemorates the moment when Lord Rama broke Lord Shiva’s bow during Swayamvaram and married Sita Devi.  

Temple Deputy EO Sri. Natesh Babu, Superintendent Sri. Hanumanthaiah, Temple Inspector Sri. Naveen and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శివధనుర్భంగాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి రాజసం

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 22: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో శ్రీ కోదండ రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది.

ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.