ANKURARPANAM FOR APPALAYAGUNTA BRAHMOTSAVAMS PERFORMED_ శాస్త్రోక్తంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 22 Jun. 18: The Ankurarpanam for annual Brahmotsavams at Appalayagunta was performed on Friday evening.

The celestial fete was observed with the priests performing Beejavapanam amidst chanting of veda mantras between 6pm and 8pm.

Meanwhile the Dhwajarohanam will be performed between 7am and 7.30am in the auspicious Meena Lagnam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2018 జూన్‌ 22: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం వైభవంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు విశ్వరూపదర్శనం కల్పించారు. ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు శ్రీవారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు మేదిరిపూజ, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించనున్నారు.

జూన్‌ 23న ధ్వజారోహణం :

జూన్‌ 23వ తేదీ శనివారం ధ్వజారోహణంతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 7.00 నుండి 7.30 గంటల మధ్య మిధున లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

23-06-2018(శనివారం) ధ్వజారోహణం(మిధున లగ్నం) పెద్దశేష వాహనం

24-06-2018(ఆదివారం) చిన్నశేష వాహనం హంస వాహనం

25-06-2018(సోమవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

26-06-2018(మంగళవారం)కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

27-06-2018(బుధవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

28-06-2018(గురువారం) హనుమంత వాహనం గజ వాహనం

29-06-2018(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

30-06-2018(శనివారం) రథోత్సవం అశ్వవాహనం

1-07-2018(ఆదివారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్‌ 26వ తేదీ సాయంత్రం 5.00 నుండి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించ నున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.