“NARA KESARI” TAKES RIDE ON SIMHA VAHANAM_ సింహ వాహనంపై యోగ నరసింహుడి అవతారంలో శ్రీ మలయప్ప
Tirumala, 25 September 2017:On the third day morning the processional deity of Lord Sri Malayappa Swamy is taken out in a procession on Simha Vahanam. Simha- the Lion is a symbol of royalty and power. Lord assumed the form of half man and half lion in his Narasimha Avathara. Lord Sri Krishna says in Bhagavath Geetha that He is the Lion among the animals.
The incarnation of Lord Vishnu as “Nara Kesari” (most ferocious and strong among the animals-Lion) is an indication of Lord Venkateswara as a powerful entity born to punish the erring anti-social elements on the universe and devoted for protection of the righteous, poor and the weaker sections in the society.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
సింహ వాహనంపై యోగ నరసింహుడి అవతారంలో శ్రీ మలయప్ప
సెప్టెంబర్ 25, తిరుమల 2017: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మూెత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్ప సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బ ందాలు చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు.
కాగా మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 7.00 నుండి 8.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగాయి. రాత్రి 9.00 నుండి 11.00 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళయే అనుకూలం. అందుకే శ్రీమలయప్పకి మూడోరోజు రాత్రి మొదటి యామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధి శ్రీకె.యస్.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాగా బ్రహ్మూెత్సవాలలో నాల్గవ రోజైన మంగళవారం ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు కల్పవ క్ష వాహనం, రాత్రి 9.00 నుండి 11.00 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.