CULTURAL BONAZA AT SIMHA VAHANAM_ సింహవాహనసేవలో సాంస్కృతిక వైభవం

Tirumala, 25 September 2017: The display of devotional sangeet. bhakti culture came to fore on the third day of the Brahmotsavam-2017 during the Simha Vahanam on the four mada streets.

The devotional extravaganza has been organised by the Hindu Dharma Prachara Parishad, Annamacharya Project and Dasa Project with over 100 teams of artists comprising of 1500 performers in dance, sankeertans, folk arts like tappeta gullu, Dappu vadhyam, kolatalu etc.

Significantly this year Srinivasa bhajan mandali from Shivamogga of Karnataka presented Yalayala traditional ballad dance. 30 kerala young men and damsels who were doctors, software workers etc performed kathakali under the stewardship of Sri Vijayaprakash.

Team of Hemalatha from Rajamundry the Sri Garudadri bhajan mandali performed Sri Ganjendramotha episode with artists playing role of Gaja and Crocodile in a spectacular manner. They also displayed the episode of Narasimha slaying Hiranyakasupu

110 artists from Kollapur of Maharashtra led by Sri M G Karthikar presented rythamic drum beating which they have been performing at all Brahmanisms for last 21 years.

Fifteen flute players from M G Kota village of Nimmanapalli mandal of Chittor district presented a wonderful flute dance under the aegis of the Sri Lakshmi Srinivas bhajan mandali With two dappu beaters there were 9 talam beaters who also wore ankelet bells

Artists from Gudiyattam of Tamilnadu who performed Dappu beating won the hearts of the devotees who also danced to the drum rhythm in the galleries of mada street.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

సింహవాహనసేవలో సాంస్కృతిక వైభవం

సెప్టెంబర్‌ 25, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో మూడోరోజైన సోమవారం ఉదయం సింహవాహనసేవలో కళాబృందాలు సాంస్కృతిక వైభవాన్ని చాటాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్యప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మలయాళ సంప్రదాయ నృత్యం :

కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గలోని తరికెర ప్రాంతానికి చెందిన శ్రీనివాస భజనమండలి ప్రదర్శించిన యలయాళ సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది. 30 మంది యువతీ యువకులు కేరళ సంప్రదాయ దుస్తులను ధరించి చక్కగా అభినయించారు. కళ్లను అటు ఇటు తిప్పుతూ కథాకళి రీతిలో ఆసక్తికరంగా ఈ నృత్యం సాగింది. ఈ ప్రదర్శన చేసిన యువతీ యువకుల్లో పలువురు డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఉండడం విశేషం. శ్రీ విజయప్రకాష్‌ ఆధ్వర్యలో ఈ నృత్య ప్రదర్శన జరిగింది.

కళ్లకు కట్టేలా ‘గజేంద్ర మోక్షం’ :

రాజమండ్రికి చెందిన శ్రీమతి హేమలత ఆధ్వర్యంలో శ్రీ గరుడాద్రివాసా భజన మండలి సభ్యులు గజేంద్ర మోక్షం ఘట్టాన్ని కళ్లకు కట్టేలా ప్రదర్శించారు. ఇందులో కరి(గజం), మకరి(మొసలి), శ్రీమహావిష్ణువు వేషధారణలో కళాకారులు పాల్గొన్నారు. ఉగ్రనరసింహుడు హిరణ్యకశిపుని వధించే సన్నివేశాన్ని కూడా చేసి చూపారు.

అలరించిన కొల్హాపూర్‌ కళాకారుల డ్రమ్స్‌ వాయిద్యం :

మహరాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన 110 మంది కళాకారులు కలిసి ప్రదర్శించిన డ్రమ్స్‌ వాయిద్యం లయబద్ధంగా సాగింది. శ్రీ ఎం.జి.కార్తికర్‌ ఆధ్వర్యంలో 21 ఏళ్లుగా వీరు బ్రహ్మూెత్సవాల్లో ఉచితంగా ప్రదర్శనలిస్తున్నారు. పెద్ద పెద్ద డ్రమ్ములను లయబద్ధంగా వాయిస్తూ వీరు ప్రదర్శన ఇచ్చారు. ఈ వాయిద్యానికి అనుగుణంగా కొందరు కళాకారులు నృత్యం చేస్తూ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు.

పిల్లనగ్రోవి నృత్యం :

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం ఎం.జి.కోట గ్రామానికి చెందిన 15 మంది కళాకారులు ప్రదర్శించిన పిల్లనగ్రోవి నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మీ శ్రీనివాస భజనమండలి ఆధ్వర్యంలో పదేళ్లుగా వీరు బ్రహ్మూెత్సవాల్లో ప్రదర్శనలిస్తున్నారు. నలుగురు కళాకారులు పిల్లనగ్రోవిని వాయించగా, ఇద్దరు డప్పు, తొమ్మిది మంది తాళాలను వాయించారు. కాళ్లకు గజ్జెలు కట్టుకుని పిల్లనగ్రోవిని వాయిస్తుండగా, మిగిలిన కళాకారులు వారిని అనుసరిస్తూ చక్కగా అడుగులు కలిపి ప్రదర్శనను రక్తి కట్టించారు.

అలాగే, తమిళనాడులోని గుడియాత్తంకు చెందిన కళాకారులు డప్పు వాయిద్యం ఎంతగానో ఆకట్టుకుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.