KOIL ALWAR TIRUMANJANAM AT SRI GT _ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 2 Jan. 20: Ahead of Vaikunta Ekadasi on January 6,  the annual cleansing fete of Koil Alwar Thirumanjanam was performed at the Sri Govinda Raja Swamy Temple on Thursday morning.

After morning rituals, the traditional cleansing activity began at 6.30am and lasted upto 8.30 am while the Darshan commenced at 9.30 am. 

DyEO Smt Varalakshmi, AEO Sri Ravi Kumar, Temple chief priest AP Srinivasa Dikshitulu and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి,2020 జ‌న‌వ‌రి 02 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో జ‌న‌వ‌రి 6వ తేదీ వైకుంఠ ఏకాద‌శి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.  అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎ.పి.శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ శ‌ర్మ‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర బాబు, ఇతర అధికారులు, ఆర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.