BHOGA SRINIVASA MURTHY AVATAROTSAVAM OBSERVED _ శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

Tirumala, 20 Jun. 21: The annual Special Sahasra Kalasabhishekam marking the Avatarotsavam of the silver idol of Sri Bhoga Srinivasamurthy was observed with religious fervour in Tirumala temple on Sunday.

Every year TTD performs a special Shasra Kalasabhishekam marking the consecration of Bhoga Srinivasa Murthy by Pallava Queen Samavai Perundevi in the year 614 AD. The related inscription can be seen on the wall below Vimana Venkateswara Shrine in the first Prakaram. 

This silver idol is part of the Pancha Beras and this is also known as ‘Kautuka Beram’ in Agamic terminology. 

TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీభోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

తిరుమల, 2021 జూన్ 20: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు.

చారిత్రక నేపథ్యం :

పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.

టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ శేఖర్ రెడ్డి, శ్రీ కుమారగురు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.