PINDI DEEPOTSAVAM PROCESSION HELD IN A GRAND MANNER – TTD JEO SRI PRABHALA GOPINATH _ భక్తుల అంతరంగాల్లో యోగజ్యోతి వెలిగించడమే పిండి దీపారాధన లక్ష్యం

Tirupati, October 3, 2026: TTD JEO (Education and Health) Sri Prabhala Gopinath said that Pindi Deepotsavam aims to promote spiritual awareness and kindle the light of devotion and knowledge in the hearts of devotees.

The Pindi Deepotsavam procession was held on Saturday, the third Saturday of the holy Peratasi month, from the TTD Administrative Building Parade Grounds to Alipiri Padala Mandapam, accompanied by traditional music and Govinda Nama Sankirtana.

He said devotees believe that lighting Pindi Deepam brings happiness and prosperity. The programme was organised under the direction of TTD Chairman Sri B.R. Naidu and EO Sri Muddada Ravichandra.

Hindu Dharma Prachara Parishad Secretary Dr. Medasani Mohan explained the spiritual significance of Pindi Deepam and recalled the devotion of Kurava Nambi and Tondaman Chakravarthy towards Lord Venkateswara.

Special rituals were performed to the Pindi Deepam at the TTD Administrative Building before it was taken in procession to Alipiri Padala Mandapam for worship.

TTD Board Members Smt. Panabaka Lakshmi, Sri G. Bhanu Prakash Reddy and Sri Dollar Divakar Reddy, SVBC Chairman Sri Sridhar Varma, officials, priests, Srivari Sevaks, staff and devotees participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

భక్తుల అంతరంగాల్లో యోగజ్యోతి వెలిగించడమే పిండి దీపారాధన లక్ష్యం

వైభవంగా పిండి దీపోత్సవ శోభాయాత్ర : టీటీడీ జేఈవో శ్రీ ప్రభల గోపీనాథ్

తిరుపతి, 2026 అక్టోబరు 03: పవిత్ర పెరటాసి మాసం మూడవ శనివారం సందర్భంగా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించి, వారి అంతరంగాల్లో భక్తి, జ్ఞాన జ్యోతులను వెలిగించడమే పిండి దీపోత్సవ లక్ష్యమని టీటీడీ జేఈవో (విద్యా, ఆరోగ్యం) శ్రీ ప్రభల గోపీనాథ్ తెలిపారు.

టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు పిండి దీపోత్సవ శోభాయాత్ర మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగింది.

మనసును పిండిగా.. జ్ఞానాన్ని జ్యోతిగా వెలిగించాలి

పిండి దీపారాధనతో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉందని జేఈవో తెలిపారు. టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ, భక్తులు తమ మనసును పిండిగా, జ్ఞానాన్ని జ్యోతిగా భావించి భగవంతుని ఆరాధించాలని సూచించారు. కురవ నంబి, తొండమాన్ చక్రవర్తి పిండి దీపంతో శ్రీవారిని ఆరాధించిన విశేషాలను వివరించారు.

శాస్త్రోక్తంగా పూజలు

శోభాయాత్రకు ముందు టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో అర్చకులు పిండి దీపానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీపాన్ని అలిపిరి పాదాల మండపానికి తీసుకువెళ్లి ప్రతిష్ఠించి పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ శ్రీధర్ వర్మ, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు, సీఈ శ్రీ మనోహరం, ఎస్ఈ శ్రీ వేంకటేశ్వర్లు, విజీఓ శ్రీ గిరిధర్, సిఎంవో డాక్టర్ కుసుమ కుమారి,  ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.