ORNAMENTS DONATED _ శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Tirumala, 10 October 2026: Smt. Aarti Bindal along with her husband from Jaipur donated Rs. 51.55 lakh worth jewels to Sri Venkateswara Swamy Tirumala on Saturday.
The ornaments include a gold pendant weighing 147 grams, studded with diamonds and precious stones, worth Rs. 44.35 lakh, and a three-strand pearl necklace weighing 27 grams, studded with diamonds and rubies, worth Rs. 7.20 lakh.
On this occasion, the donors handed over the ornaments to TTD Chairman Sri B.R. Naidu at the Ranganayakula Mandapam inside the Srivari Temple at Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
తిరుమల, 2026 అక్టోబర్ 10: జైపూర్ కు చెందిన శ్రీమతి ఆర్తి బిందాల్ దంపతులు తిరుమల శ్రీవారికి శనివారం రూ.51.55 లక్షలు విలువైన 174 గ్రాముల బంగారు లాకెట్, ముత్యాల హారాన్ని విరాళంగా అందించారు.
వీటిలో రూ.44.35 లక్షలు విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్, రూ.7.20 లక్షలు విలువైన వజ్రాలు, కెంపులు పొదిగిన 27 గ్రాముల మూడు వరుసల ముత్యాల హారాలు ఉన్నాయి.
ఈ మేరకు దాత తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు ఆభరణాలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.



