SV MUSEUM DEVELOPED ON GLOBAL STANDARDS _ ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల‌తో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర మ్యూజియం

Tirumala, 13 October 2026: The Sri Venkateswara Museum in Tirumala is developed matching world-class standards, said Chief Museum Officer Sri Somannarayana.

Addressing the media at the Media Centre in Tirumala, on Tuesday evening he said the museum was inaugurated by Honorable Chief Minister if Andhra Pradesh Sri Nara Chandrababu Naidu on the occasion of Srivari Salakatla Brahmotsavam. 

After a trial run following Srivari Navaratri Brahmotsavam, the museum will be opened up to devotees in the first week of November.

The museum has 14 galleries showcasing Tirumala history and heritage through sculptures, digital displays of the rare ornaments, weapons, and musical instruments. 

The Brahmandam Gallery, designed with the latest technology, will be a major attraction, he observed.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల‌తో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర మ్యూజియం

చీఫ్ మ్యూజియం ఆఫీస‌ర్ శ్రీ సోమ‌న్నారాయ‌ణ‌

తిరుమ‌ల‌, 2026 అక్టోబ‌ర్ 13: తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర మ్యూజియంను ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాలో అభివృద్ధి చేసిన‌ట్లు చీఫ్ మ్యూజియం ఆఫీస‌ర్ శ్రీ సోమ‌న్నారాయ‌ణ తెలిపారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా-2 లోని మీడియా సెంట‌ర్ లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించార‌ని చెప్పారు. శ్రీ‌వారి నవ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల అనంత‌రం ట్రైల్ ర‌న్ నిర్వ‌హించిన అనంత‌రం న‌వంబ‌ర్ మొద‌టి వారంలో ఎస్వీ మ్యూజియంను భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని చెప్పారు.

మ్యూజియంలో మొత్తం 14 గ్యాల‌రీలు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో రూపొందించిన బ్ర‌హ్మాండం గ్యాల‌రీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంటుంద‌ని తెలిపారు. తిరుమ‌ల చ‌రిత్ర‌ను తెలియ‌జేసేలా శిల్ప‌క‌ళ‌లు, ఆల‌య చ‌రిత్ర‌, స్వామివారి ఆభ‌ర‌ణాలు (డిజిట‌ల్), ఆయుధాలు, సంగీత వాయిద్యాలు వంటి వివిధ క‌ళా ఖండాల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచుతున్న‌ట్లు చెప్పారు. రూ.50 ధ‌ర‌ను మ్యూజియం ప్ర‌వేశ రుసుంను పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఈ టికెట్ల‌ను టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌వి, పీఆర్వో కుమారి నీలిమ, మ్యూజియం క్యూరేట‌ర్ శ్రీ శివ కుమార్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.