KARTHIKA DEEPOTSAVAM CELEBRATED GRANDLY AT TTD LOCAL TEMPLES _ టీటీడీ స్థానిక ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం

KARTHIKA DEEPOTSAVAM CELEBRATED GRANDLY AT TTD LOCAL TEMPLES

Tirupati, November 24, 2026: Karthika Deepotsavams were celebrated with devotion at TTD local temples on Tuesday. Special rituals and Deeparadhana were performed at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor; Sri Govindaraja Swamy Temple and Sri Kodandarama Temple, Tirupati; Sri Venugopala Swamy Temple, Karvetinagaram; and Sri Kalyana Venkateswara Swamy Temple, Narayanavanam.

As part of the celebrations, the deities were taken in processions along the temple streets at Karvetinagaram and Narayanavanam.

Teppotsavams Conclude at Narayanavanam

The five-day Teppotsavams at Sri Kalyana Venkateswara Swamy Temple, Narayanavanam, concluded grandly on Tuesday. On the final day, Sri Kalyana Venkateswara Swamy, along with Sridevi and Bhudevi, blessed devotees during the float festival.

Temple officials, priests and a large number of devotees participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

టీటీడీ స్థానిక ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం

తిరుపతి, 2026 నవంబరు 24: టీటీడీ ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాల్లో మంగళవారం కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాలన్నీ దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహించి భక్తులకు దైవదర్శన భాగ్యం కల్పించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం 6.30 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుంచి కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఆలయ మర్యాదలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి ఆస్థానం నిర్వహించారు.

శ్రీ కోదండరామాలయంలో

శ్రీ కోదండరామాలయంలో రాత్రి 8 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుంచి ఆలయ మర్యాదలతో పడి, కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి కార్తీక దీపోత్సవ ఆస్థానం నిర్వహించారు.

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో

కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు.

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

వైభవంగా ముగిసిన తెప్పోత్సవాలు

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన తెప్పోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ధర్మయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వెంకట శివప్రసాద్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.