ARRANGE LED LIGHTS IN TIRUMALA BEFORE THIS MONTH END- TTD EO SRI AK SINGHAL_ తిరుమలలో ఈ నెలాఖరులోపు పూర్తిగా ఎల్‌ఇడి దీపాలు ఏర్పాటుచేయాలి :టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

Tirupati, 3 July 2017: TTD EO Sri Anil Kumar Singhal instructed the engineering wing officials to complete the arrangement of LED lights in Tirumala by July end.

The weekly review meeting with senior officers of TTD held in the chambers of TTD EO on Monday morning. The EO reviewed on various developmental activities with respect to various departments along with JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar and CVSO Sri A Ravi Krishna. During the review meeting the EO instructed the procurement wing officials to go for qualitative paper plates for serving annaprasadam to pilgrims. The EO also directed the Annaprasadam wing officials to see that there is no wastage of food while serving to pilgrims waiting in compartments.

With regard to sold waste management, the EO instructed the concerned to start the works immediately with the contractor. “The beautification works in Tirupati and Tirumala should be taken up and the greenery should be started on divides too to give enhanced look”, he added.

The EO instructed Tirupati JEO Sri Pola Bhaskar to chalk out a plan to make use of TTD lands located in different states across the country. “Similar to Kosuvaripalli, a solar plant shall be started in the TTD land located at Nujiveedu in Krishna district with 8MW capacity”, the EO said.

The other issues which were reviewed included construction of additional toilets in Srivari Mettu footpath route, RO plant in II and III chowltries in Tirupati for the sake of pilgrims, completion of ghee storage tank construction works in Tiruchanoor.

CE Sri Chandrasekhar Reddy, Additional FACAO Sri Balaji, SEs Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy, Sri Venkateswarulu, GM Sri Sesha Reddy were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఈ నెలాఖరులోపు పూర్తిగా ఎల్‌ఇడి దీపాలు ఏర్పాటుచేయాలి :టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2017 జూలై 03: తిరుమలలో ఈ నెలాఖరులోపు పూర్తిగా ఎల్‌ఈడి విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమీక్ష, సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు ఆహారపదార్థాలను అందించే పేపర్‌ ప్లేట్లను మరింత నాణ్యంగా ఉండేలా చూడాలన్నారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులకు అందించే అన్నప్రసాదాలు వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తిరుమలలో ఘనవ్యర్థాల నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టర్‌ ద్వారా త్వరితగతిన పనులు ప్రారంభించాలని సూచించారు. తిరుమల, తిరుపతిలో పచ్చదనం పెంచి సుందరీకరణ పనులు చేపట్టాలని డివైడర్లపై మొక్కలు పెంచాలని, రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని ఈవో ఆదేశించారు.

వివిధ రాష్ట్రాలలో టిటిడికి సంబంధించిన భూములను సక్రమంగా వినియోగించుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ను ఈవో ఆదేశించారు. టిటిడిలో విద్యుత్‌కు సంబంధించి స్వయం సమృద్ధిని సాధించడంలో భాగంగా చిత్తూరు జిల్లా కోసువారిపల్లె తరహాలో కృష్ణా జిల్లా నూజివీడులోని టిటిడి స్థలంలో 8 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుచానూరులో నిర్మాణంలో ఉన్న నెయ్యి నిల్వ ట్యాంకులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో త్వరితగతిన అదనపు మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించారు. తిరుపతిలో 2,3 సత్రాలలో భక్తులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ .బాలాజీ, ఎస్‌ఈలు శ్రీ రమేష్‌ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.