CHANDRAGIRI RAMA TEMPLE PAVITROTSAVAMS CONCLUDE_ చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

Tirupati, 13 October 2017: The three day Pavitrotsavams concluded on a grand religious note in Sri Kodanda Rama Swamy temple at Chandragiri on Friday.

The series of religious activities including Dwara Toranam, Dhwajakumbharadhana, Chatustarchana, Shanti Homam, Mahapurnahuti, Pavitra Vitarana and Veda Sattumora were performed.

Later in the evening, Sri Sita Rama Kalyanam was performed with religious fervour on the advent of Punarvasu nakshatram, the birth star of Lord Sri Kodanda Rama Swamy.

Temple DyEO Sri Venkataiah, AEO Sri Dhanajeyulu and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి, 2017 అక్టోబరు 13: చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు.

ఉదయం 9.00 నుండి 11.00 గంట వరకు ద్వారాతోరణ, ధ్వజకుంభారాధన, చతుష్టార్చన, మూర్తిహోమం, శాంతిహోమం, మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ, వేదశాత్‌మొర కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం ఉదయం 11.30 నుండి 1.00 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతస్వామివారు, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్‌లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం చక్రతాళ్వార్‌కు చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.

శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం 5.00 నుండి 6.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు.

ఇందులోభాగంగా ఆలయంలో సాయంత్రం 5.00 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీవెంకటయ్య, ఏఈవో శ్రీధనంజయులు, కంకణభట్టర్‌ శ్రీ కృష్ణభట్టర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమారి లీనశ్రీ, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.